Tomato For Beauty : టమాట.. ఇది మనందరికి తెలిసిందే. వంటల్లో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తూ ఉంటాం. టమాట మన ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కేవలం మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా టమాట ఎంతో ఉపయోగపడుతుంది. టమాటాలను వాడడం వల్ల మనం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ముఖం నల్లగా మారడం, ముఖంపై ట్యాన్ పేరుకుపోవడం వంటివి జరుగుతుంది. ఇటువంటి సమస్యలన్నింటిని తగ్గించి ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చే టమాటాకు ఉంది.
టమాటాను ఎలా ఉపయోగించడం వల్ల మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనం శనగపిండిని, రోజ్ వాటర్ ను, టమాట, పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పెరుగు వేసి కలపాలి. తరువాత ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ టమాట రసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి రెండు నుండి మూడు సార్లు వాడడం వల్ల ముఖం అందంగా మారుతుంది.
ముఖంపై ఉండే మచ్చలు, నలుపు తొలగిపోతుంది. చర్మానికి కావల్సిన పోషకాలు లభించి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల చర్మానికి కావల్సిన తేమ అంది చర్మం పొడిబారడకుండా ఉంటుంది. చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు, దుమ్ము, ధూళి కూడా తొలగిపోతుంది. ఖరీదైన ఫేస్ వాష్ లను, క్రీములను వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే ఉండే టమాటాలతో మనం మన ముఖాన్ని సహజ సిద్దంగా అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది.