Cauliflower Tomato : కాలిఫ్ల‌వ‌ర్ ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Cauliflower Tomato : మ‌నం క్యాలీప్ల‌వ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. క్యాలీప్ల‌వ‌ర్ తో సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూనే ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూర‌ను రుచిగా, ఎవ‌రైనా చేసుకోగ‌లిగేంత తేలిక‌గా, ఎటువంటి మసాలాలు వేయ‌కుండా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ముక్క‌లుగా త‌రిగిన క్యాలీప్ల‌వ‌ర్ – 1, త‌రిగిన ట‌మాటాలు – 3, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు- త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్.

Cauliflower Tomato recipe in telugu tastes better with rice
Cauliflower Tomato

క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూర త‌యారీ విధానం..

ముందుగా క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేడి నీటిలో వేసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ముక్క‌ల‌ను ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌గ్గించాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌ర‌లా మూత‌ను ఉంచి మ‌రో 5 నిమిషాల పాటు మ‌గ్గించాలి.

త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. వీటిపై మూత‌ను ఉంచి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ క్యాలీప్ల‌వ‌ర్ ను పూర్తిగా ఉడికించాలి. కూర ఉడికి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత మ‌రోసారి క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts