Turmeric For Stretch Marks : ప‌సుపుతో ఇలా చేస్తే చాలు.. స్ట్రెచ్ మార్క్స్ అస‌లే ఉండ‌వు..!

Turmeric For Stretch Marks : వంట‌ల్లో మ‌నం ప‌సుపును విరివిగా వాడుతూ ఉంటాము. ప‌సుపు ఉండ‌ని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వంట్ల‌లో ప‌సుపును వాడ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌టి రంగు రావ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌సుపు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌సుపు మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు చ‌ర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌న చ‌ర్మ‌స‌మ‌స్య‌ల‌న్నింటిని త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌న‌లో చాలా మంది మొటిముల‌, మ‌చ్చ‌లు, చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం, చ‌ర్మంపై స్ట్రెచ్ మార్క్స్, జిడ్డు వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇటువంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌న్నింటిని త‌గ్గించ‌డంలో ప‌సుపు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు చ‌ర్మం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. అయితే ప‌సుపును ఎలా వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌సుపులో నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమలు, పిగ్మెంటేష‌న్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Turmeric For Stretch Marks how to use it must know
Turmeric For Stretch Marks

అలాగే ప‌సుపులో ఆలివ్ నూనెను క‌లిపి గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. అలాగే ముడ‌త‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ప‌సుపులో ట‌మాట ర‌సం, పాలు, బియ్యంపిండి క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చ‌ర్మంపై రాసి ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం బిగుతుగా త‌యార‌వుతుంది. చ‌ర్మంపై ఉండే జిడ్డు కూడా తొల‌గిపోతుంది. అలాగే స్ట్రెచ్ మార్క్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ప‌సుపులో శ‌న‌గ‌పిండి, పాలు క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స్ట్రెచ్ మార్క్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ విధంగా ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ ఖ‌ర్చుతో త‌గ్గించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts