ప్రతి రోజూ పాలను తాగడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చర్మాన్ని సంరక్షించడంలోనూ పాలు పనిచేస్తాయి. వాటితో చర్మ సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొద్దిగా పాలను తీసుకుని వాటితో తగినంత తేనె, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని శరీరంపై రాయాలి. కొంత సేపటి తరువాత స్నానం చేయాలి. దీంతో చర్మం మంచి రంగులోకి వస్తుంది.
2. రాత్రి పూట పెదవులపై పాలను రాయాలి. మరుసటి రోజు కడిగేయాలి. ఇలా 7 రోజుల పాటు చేస్తే పెదవులు అందంగా మారుతాయి. మృతకణాలు చనిపోతాయి. పెదవులు కాంతివంతంగా కనిపిస్తాయి.
3. కొద్దిగా పాలు, తేనెలను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా రాసుకోవాలి. తరువాత కొంత సేపటికి కడిగేయాలి. వారంలో ఇలా 2 సార్లు చేయాలి. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
4. పాలలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా వేయాలి. 30 నిమిషాల తరువాత కడిగేయాలి. వారంలో ఇలా 2 సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
5. రోజ్ వాటర్‌ను కొద్దిగా తీసుకుని పాలలో కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే ముఖం చక్కని నిగారింపును సొంతం చేసుకుంటుంది. చర్మం మృదువుగా మారుతుంది.