రోగ నిరోధ‌క శ‌క్తి పెరగాలంటే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉన్న ఈ 7 డ్రింక్స్‌ను తాగండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో విట‌మిన్ సి ఒక‌టి. ఇది మ‌న శ‌రీరానికి రోజూ కావ‌ల్సిందే. దీన్ని శ‌రీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. నిల్వ ఉంచుకోలేదు. క‌నుక రోజూ విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఈ క్ర‌మంలోనే విట‌మిన్ సి రోజూ అందేలా చూసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఈ 7 ర‌కాల డ్రింక్స్ ను తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. మ‌రి ఆ డ్రింక్స్ ఏమిటంటే..

రోగ నిరోధ‌క శ‌క్తి పెరగాలంటే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉన్న ఈ 7 డ్రింక్స్‌ను తాగండి..!

1. పుదీనా, కొత్తిమీర‌, వాముల‌ను వేసి త‌యారు చేసి హెర్బ‌ల్ టీలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని రోజూ తాగుతుంటే విట‌మిన్ సి ల‌భిస్తుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి.

2. పుచ్చ‌కాయ‌, నారింజ‌, లిచీ, పైనాపిల్ వంటి పండ్ల‌కు చెందిన జ్యూస్‌ల‌ను రోజూ తాగ‌వ‌చ్చు. వీటిల్లోనూ విట‌మిన్ సి అధికంగా ఉంటుంది.

3. స్ట్రాబెర్రీలు, మామిడి పండ్లు, యాపిల్స్, కివీల‌కు చెందిన జ్యూస్‌ల‌ను కూడా రోజూ తాగ‌వ‌చ్చ‌. వీటిల్లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

4. పైనాపిల్ ప‌న్నా త‌యారు చేసుకుని రోజూ తాగ‌వ‌చ్చు. ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ‌క్రియను మెరుగు ప‌రుస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

5. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం, ఉప్పు, చ‌క్కెర క‌లిపి తాగ‌వ‌చ్చు. దీని వ‌ల్ల కూడా విట‌మిన్ సి ల‌భిస్తుంది.

6. మామిడి పండు గుజ్జు, ట‌మాటా గుజ్జు, నిమ్మ‌ర‌సం క‌లిపి జ్యూస్‌లా చేసుకుని తాగ‌వ‌చ్చు. వీటిల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. క‌నుక రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ క్రియ మెరుగు ప‌డుతుంది.

7. పాల‌కూర‌, బ్రోక‌లీ, క్యాబేజీ, కాలిఫ్ల‌వ‌ర్‌ల‌ను వేసి సూప్ త‌యారు చేసి రోజూ తాగ‌వ‌చ్చు. ఇలా కూడా విట‌మిన్ సి ల‌భిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Admin

Recent Posts