Winter Skin Care Tips : చలికి బాగా పగిలిన చర్మం తేమగా, మృదువుగా మారాలంటే.. ఇలా చేయండి..!

Winter Skin Care Tips : చలికాలంలో సహజంగానే చర్మం పగిలిపోతుంటుంది. కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో చర్మం అంతా పగిలిపోయి అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల చర్మంలో పొడిదనం తగ్గుతుంది. పగిలిపోకుండా కాపాడుకోవచ్చు. దీంతో చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. మరి అందుకు ఏం చేయాలంటే..

Winter Skin Care Tips  follow these remedies for moisturized skin

1. కోడిగుడ్డులోని పసుపు పచ్చ సొనను ఓ గిన్నెలో వేసి విడిగా తీసుకోవాలి. అందులో చెంచా నిమ్మరసం, రెండు చుక్కల అవకాడో నూనె, చిటికెడు సముద్రపు ఉప్పును వేసి మిక్సీలో మయోనైజ్‌ను తయారు చేసుకోవాలి. మాయిశ్చరైజింగ్‌ గుణాలు పుష్కలంగా ఉండే ఈ మిశ్రమాన్ని రెండు చెంచాలు తీసుకుని చెంచా బేబీ ఆయిల్‌ను కలిపి చర్మానికి రాసి మర్దనా చేయాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే పసిపిల్లల చర్మంలా మృదువుగా మారడమే కాదు, మెరుపులీనుతుంది.

2. కోడిగుడ్డులోని పసుపు పచ్చని సొనకు విటమిన్‌ ఇ, ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే బాదం నూనెను రెండు చెంచాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి బాగా ఆరనిచ్చి కడిగేయాలి. ఇది చర్మం ఏ వాతావరణంలోనైనా మృదువుగా ఉండేలా సంరక్షిస్తుంది.

3. రెండు చెంచాల కలబంద గుజ్జుకు సమాన పరిమాణంలో తేనె, బాదంనూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి ఓ అరగంట ఆరనివ్వాలి. తరువాత శుభ్రం చేస్తే చాలు.. చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.

4. రెండు చెంచాల కొబ్బరినూనెకు సమాన పరిమాణంలో తేనె కలిపి ముఖం, మెడకు, ఇతర భాగాల్లో అప్లై చేయాలి. ఓ అరగంట ఆగి నీటితో కడిగితే చాలు. చర్మం తేమగా మారుతుంది.

5. అరటి పండును గుజ్జులా చేసి రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. యాంటీ బాక్టీరియన్‌ గుణాలున్న తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పగుళ్లు రాకుండా సంరక్షిస్తుంది. దీని వల్ల చలి నుంచి చర్మం సురక్షితంగా ఉంటుంది.

Admin

Recent Posts