Boiled Peanuts : వేరుశెనగలను ఉడికించి రోజూ తింటే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..!

Boiled Peanuts : పొట్టు తీసిన వేరుశెనగలను సహజంగానే రోజూ చాలా మంది వాడుతుంటారు. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాల్లో చట్నీకి పల్లీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక కొన్ని రకాల వంటల్లోనూ వేరుశెనగలను వేస్తుంటారు. వీటితో తీపి వంటకాలను కూడా చేస్తారు. అయితే వేరుశెనగలను పొట్టుతో సహా ఉడకబెట్టి రోజూ తింటే అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

eat daily one cup of Boiled Peanuts for these wonderful health benefits

1. ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేసేవారు, రోజూ శారీరక శ్రమ చేసేవారు, చిన్నారులకు ఉడకబెట్టిన పల్లీలు తక్షణ శక్తిని అందిస్తాయి. దీంతో అలసట, నీరసం తగ్గుతాయి. శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. మళ్లీ చురుగ్గా పనిచేస్తారు. అలసట రాదు.

2. సాయంత్రం సమయంలో జంక్‌ ఫుడ్‌ తినే బదులు వేరుశెనగలను ఉడికించి తింటే ఎంతో మంచిది. వీటి ద్వారా అనేక పోషకాలను, శక్తిని పొందవచ్చు. దాంతో వ్యాధులను నయం చేసుకోవచ్చు.

3. వేరుశెనగల్లో విటమిన్‌ ఇ, బి కాంప్లెక్స్‌ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి స్త్రీ, పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలను తగ్గిస్తాయి. సంతానం కలిగే అవకాశాలను పెంచుతాయి. అలాగే పిల్లల్లో కండరాల నిర్మాణం, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి. కనుక రోజూ ఒక కప్పు వేరుశెనగలను ఉడకబెట్టి తినాలి.

4. గర్భిణీలు రోజూ ఉడికించిన వేరుశెనగలను తినడం వల్ల అధిక మోతాదులో ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది. ఇది బిడ్డ ఎదుగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పుట్టే పిల్లల్లో లోపాలు రాకుండా ఉంటాయి.

5. వేరుశెనగల్లో మెగ్నిషియం, ఫాస్ఫరస్‌ అధికంగా ఉంటాయి. వీటి వల్ల కండరాల నిర్మాణం జరుగతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ తగ్గుతాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.

6. ఉడికించిన వేరుశెనగల్లో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. కనుక దంతాలు, ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లల్లో అయితే ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. వయస్సుకు తగిన ఎత్తు, బరువు పెరుగుతారు.

7. వేరుశెనగల్లో అమైనో యాసిడ్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తాయి.

8. అధిక బరువు తగ్గాలనుకునే వారికి చక్కని స్నాక్స్‌లా వేరుశెనగలు ఉపయోగపడతాయి. వీటిని తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. తద్వారా తినే ఆహారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.

వేరుశెనగలను తినడం మంచిదే అయినప్పటికీ అధికంగా తింటే గ్యాస్‌ ట్రబుల్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వరకే గ్యాస్ ట్రబుల్‌ సమస్య ఉన్నవారు వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఎవరైనా సరే రోజు ఉడకబెట్టిన వేరుశెనగలను ఒక కప్పు మోతాదులో ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్‌ సమయంలో తింటే చాలు, ఎన్నో లాభాలను పొందవచ్చు.

Share
Admin

Recent Posts