Darkness On Elbows : మనలో చాలా మందికి శరీరం అంతా తెల్లగా ఉన్నప్పటికీ మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉంటాయి. అలాగే కొందరిలో చేతి వేళ్ల కణుపుల దగ్గర, చంక భాగాల్లో కూడా చాలా నల్లగా అలాగే నల్లని చారలు ఉంటాయి. దీని వల్ల ఎటువంటి హాని కలగనప్పటికీ ఇవి చూడడానికి కొద్దిగా అందవిహీనంగా కనబడతాయి. సబ్బుతో ఎంత రుద్దినప్పటికీ ఈ భాగాల్లో చర్మం తెల్లగా మారదు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం మన మోచేతులను, మోకాళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను క్రమం తప్పకుండా వారం రోజుల పాటు పాటించడం వల్ల ఆయా భాగాల్లో ఉండే నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా మారుతుంది.
ఈ చిట్కాను ముఖం మీద ఉపయోగించకూడదు. ఇతర శరరీ భాగాలపై మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో లెమన్ ఫ్లేవర్ ఉండే ఈనోను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత ఎక్కువగా నురుగు వస్తుంది. నురుగు అంతా పోయిన తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను, ఒక టేబుల్ స్పూన్ తెల్లగా ఉండే ఏదైనా ఒక టూత్ పేస్ట్ ను వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని బ్రష్ తో కానీ, చేత్తో కానీ తీసుకుంటూ చర్మం నల్లగా ఉండే భాగాల్లో అనగా మోచేతులు, మోకాళ్లు, మెడ, చంక భాగం, చేతి వేళ్ల కణుపులు వంటి భాగాల్లో 5 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేస్తూ రాయాలి. తరువాత దంతాలను శుభ్రం చేసుకునే బ్రష్ తో ఆ ప్రాంతాల్లో వృత్తాకారంలో మరో 3 నిమిషాల పాటు రుద్దాలి. ఇలా చేసిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా చేయడం వల్ల ఆయా భాగాల్లో చర్మంపై ఉండే నలుపు, నల్లని చారలు తొలగిపోయి ఆయా ప్రాంతాల్లో చర్మం సాధారణ రంగులోకి మారుతుంది. ఇలా ఈ చిన్న చిట్కాను ఉపయోగించి చాలా తక్కువ సమయంలోనే మోచేతులు, మోకాళ్ల వంటి భాగాలను తెల్లగా మార్చుకోవచ్చు.