Wrinkles : వయసు పై బడిన కొద్ది చర్మం పై ముడతలు రావడం సహజం. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. నుదుటి మీద, కళ్ల పక్కన, ముక్కు మీద వచ్చిన ముడతలు మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. వీటి వల్ల మనం వయసు తక్కువగా ఉన్నప్పటికి పెద్దవారిలా కనిపిస్తాము. ఇలా ముఖం పై ముడతలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయసు పై బడడం వల్ల ముడతలు రావడం ఒకటైతే కాలుష్యం, నిద్రలేమి, పోషకాహార లోపం వల్ల కూడా చర్మంపై ముడతలు వస్తాయి. ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ముఖంపై వచ్చే ముడతలను తొలగించుకోవచ్చు.
ఇంట్లో ఉండే సహజసిద్ద పదార్థాలతో ఫేస్ ఫ్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవడంతో పాటు చర్మం పై ఉండే ముడతలు కూడా తొలగిపోతాయి. చర్మంపై వచ్చే ముడతలను తొలగించే ఫేస్ ఫ్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…. అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక టీ స్పూన్ మైదాపిండిని, అర టీ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ పెరుగును, ఒక టీ స్పూన్ నిమ్మ తొక్కల పేస్ట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత పైన తెలిపిన మిగిలిన పదార్థాలన్నీ వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కానీ, బ్రష్ తో కానీ ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవాలి.
ఈ మివ్రమాన్ని ముఖానికి వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఫ్యాక్ వేసుకున్న గంట తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేయడం వల్ల ముఖం పై వచ్చిన ముడతలు తొలగిపోతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల చర్మం పై ఉండే మలినాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు, నల్లదనం తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ముఖంపై ఉండే ముడతలను తొలగించుకోవచ్చు. ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.