చిట్కాలు

Bhringraj Leaves For Hair : ఈ ఆకుల‌ను ఇలా వాడితే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Bhringraj Leaves For Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న‌శైలి, కాలుష్యం, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, మందుల‌ను ఎక్కువ‌గా వాడ‌డం.. వంటి అనేక కార‌ణాల వల్ల జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవ‌డం అన్న‌ది అంద‌రికీ నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా మంది మార్కెట్‌లో ల‌భించే వివిధ ర‌కాల హెయిర్ కేర్ ప్రొడ‌క్ట్స్‌ను వాడుతుంటారు. ఇవి చాలా ఖ‌రీదు క‌ల‌వి అయి ఉంటాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయి. క‌నుక స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది.

ఇక జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు భృంగ‌రాజ్ ఆకులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఈ మొక్క మ‌న‌కు చుట్టూ ప‌రిస‌రాల్లో ల‌భిస్తుంది. దీని ఆకుల‌ను సేక‌రించి ఉప‌యోగించ‌వ‌చ్చు. లేదా మార్కెట్‌లో మ‌న‌కు భృంగ‌రాజ్ ఆకుల పొడి ల‌భిస్తుంది. దీన్ని అయినా వాడుకోవ‌చ్చు. భృంగ‌రాజ్ మొక్క ఆకుల‌ను సేక‌రించి శుభ్రంగా క‌డిగి మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. దీన్ని గ్లోవ్స్ స‌హాయంతో జుట్టుకు బాగా అప్లై చేయాలి. 30 నిమిషాలు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. వారంలో ఇలా క‌నీసం 2 సార్లు చేయాలి.

Bhringraj Leaves how to use them for hair growth

ఈ విధంగా భృంగ‌రాజ్ మొక్క ఆకుల‌తో చిట్కాను పాటిస్తే మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది. ఒత్తుగా మారి దృఢంగా ఉంటుంది. అలాగే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. శిరోజాలు ప్ర‌కాశవంతంగా క‌నిపిస్తాయి. చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది. మీ జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. భృంగ‌రాజ్ ఆకుల‌ను జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఆయుర్వేదంలో విరివిగా ఉప‌యోగిస్తారు. అందువ‌ల్ల మీకు జుట్టు స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా విముక్తి ల‌భిస్తుంది.

Admin

Recent Posts