Billa Ganneru For Black Hair : బిళ్ల గ‌న్నేరు ఆకుల‌తో ఇలా చేస్తే.. మీ తెల్ల జుట్టు మొత్తం న‌ల్ల‌గా మారుతుంది..!

Billa Ganneru For Black Hair : చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. పూర్వం పెద్ద వారిలోనే క‌నిపించే తెల్ల‌జుట్టు నేటి త‌రుణంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిలో క‌నిపిస్తుంది. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన మ‌న జీవ‌న విధానం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు తెల్ల‌బ‌డుతూ ఉంటుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి హెయిర్ డైల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వ‌ల్ల ఫ‌లితం ఉండ‌డంతో పాటు దుష్ప్ర‌భావాలు కూడా ఉంటాయి.

ఎటువంటి కృత్రిమ ప‌దార్థాల‌ను ఉప‌యోగించ‌కుండా కేవ‌లం స‌హ‌జ సిద్ద ప‌దార్థాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం మ‌న తెల్లజుట్టును చాలా సుల‌భంగా న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డంలో మన‌కు బిళ్ల‌గ‌న్నేరు చెట్టు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. బిళ్ల గ‌న్నేరులో ఎన్నోఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఇవి తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. తెల్ల జుట్టుతో బాధ‌ప‌డే వారు బిళ్ల గ‌న్నేరును వాడ‌డం వల్ల రెండు నెల‌ల్లోనే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అయితే బిళ్ల గ‌న్నేరును ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ముందుగా ఒక క‌ప్పు బిళ్ల గ‌న్నేరు ఆకుల‌ను తీసుకోవాలి.

Billa Ganneru For Black Hair use in this method for effective result
Billa Ganneru For Black Hair

త‌రువాత వీటిని శుభ్రం చేసుకుని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ నుండి ర‌సాన్ని తీసి గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఈ ఆకుల ర‌సంలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె, అర చెక్క నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని కాట‌న్ బాల్ స‌హాయంతో జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వీటిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్ల‌గా మారుతుంది. ఈచిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డంతో పాటు జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. ఈ విధంగా తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు బిళ్ల గ‌న్నేరును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts