Black Pepper Powder : 1 టీ స్పూన్ మోతాదులో పాలు లేదా నీటితో తీసుకుంటే చాలు.. ముఖ్యంగా పురుషులు..

Black Pepper Powder : మ‌న‌లో చాలా మంది ప్ర‌స్తుత కాలంలో రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేకపోతున్నారు. త‌ల‌నొప్పి, క‌డుపులో వికారంగా ఉండ‌డం, కంటి సంబంధిత స‌మ‌స్య‌లు, కండ‌రాల నొప్పులు, ఆక‌లి లేక‌పోవ‌డం, బ‌ద్ద‌కంగా ఉండడం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్నారు. అంతేకాకుండా మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాలతో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గి సంతాన లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అ స‌మ‌స్య‌ల‌న్నింటినీ మనం ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు.

ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల అల‌స‌ట‌, నీర‌సం త‌గ్గి, మాన‌సిక ఒత్తిడి త‌గ్గి రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగలుగుతారు. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఈ చిట్కాను ఎలా ఉప‌యోగించాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేయ‌డానికి ముందుగా మ‌న వంటింట్లో ఉండే మిరియాల‌ను, ప‌టిక బెల్లాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఒక జార్ లో 10 మిరియాల‌ను, 10 గ్రాముల ప‌టిక బెల్లాన్ని తీసుకోవాలి.

Black Pepper Powder take daily for amazing benefits
Black Pepper Powder

త‌రువాత వీటిని మెత్త‌ని పొడిలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ పొడిలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి నిద్ర‌పోవ‌డానికి అర గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాల‌ల్లో వేసి క‌లుపుకుని తాగాలి. ఇలా ప్ర‌తిరోజూచేయ‌డం వ‌ల్ల అలస‌ట త‌గ్గి రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతారు. అంతేకాకుండా ఈ మిశ్ర‌మాన్ని పాల‌లోనే కాకుండా నీటిలో వేసి క‌లుపుకుని కూడా తాగ‌వ‌చ్చు.

సాయంత్రం స‌మ‌యంలో ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఈ మిశ్ర‌మాన్ని క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఈ విధంగా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెర‌గ‌డంతోపాటు వీర్య‌క‌ణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అంతేకాకుండా న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ చిట్కా కోసం మ‌న ఉప‌యోగించిన మిరియాలు, ప‌టిక బెల్లం, ఆవు నెయ్యి.. ఇవి అన్నీ కూడా మ‌న ఆరోగ్యాన్ని మెరుగుచేసేవే. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల అల‌స‌ట త‌గ్గ‌డంతోపాటు జీర్ణ‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. అలాగే శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటాం.

Share
D

Recent Posts