Health Tips : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా శరీరంలో నిస్సత్తువ నెలకొని వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శరీరంలో బలం లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు, నీరసం, రక్తహీనత, వెన్ను నొప్పి, శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అనారోగ్య సమస్యల బారిన పడి వైద్యానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా శరీరంలో బలంలేక నిస్సత్తువ కారణంగా బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతోపాటు వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
దీని కోసం మనం ముందుగా ఒక గిన్నెలో గుప్పెడు శనగలను, నాలుగు బాదం పప్పు గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత అవి మునిగే వరకు తగినన్ని నీళ్లు పోసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన శనగలను, బాదం పప్పు గింజలను అలాగే ఒక చిన్న ముక్క బెల్లాన్ని కలిపి ఉదయం పరగడుపున తినాలి. ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి. ఇలా నానబెట్టిన శనగలను, బాదం గింజలను ప్రతిరోజూ లేదా కనీసం వారానికి మూడు సార్లు తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి అలసట, నీరసం తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణశక్తి మెరుగుపడి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇలా శనగలను, బాదం గింజలను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ గింజలను తినడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి చక్కగా నిద్రపడుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కామెర్ల వ్యాధితో బాధపడే వారు ఈ గింజలను తినడం వల్ల ఈ వ్యాధి నుండి త్వరగా బయటపడతారు. అంతేకాకుండా శరీరంలో వచ్చే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా శనగలను, బాదం గింజలను తినడం వల్ల తగినంత శక్తి లభించి నిస్సత్తువ మన దరి చేరకుండా ఉంటుంది.