Body Odour : చెమట వాసనతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరిలో వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటే మరికొందరిలో కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఈ సమస్య వేధిస్తుంది. శరీరానికి చెమట పట్టడం సహజమే కానీ చెమట నుండి వచ్చే దుర్వాసన మాత్రం మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ దుర్వాసన కారణంగా మనతో పాటు మన చుట్టూ ఉండే వారు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరం నుండి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం చెమట. ఈ చెమటకు ఉప్పు, బ్యాక్టీరియా వంటివి చేరడం వల్ల దుర్వాసన వస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నప్పుడు, అధిక బరువు వల్ల కూడా శరీరం నుండి దుర్వాసన వస్తుంది.
అంతేకాకుండా కొందరిలో జన్యుపరంగా కూడా దుర్వాసన వస్తుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి డియోడ్రెంట్ లను, ఫర్ ఫ్యూమ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి చక్కటి వాసన కలిగి ఉన్నప్పటికి వీటి తయారీలో ఎక్కువగా రసాయనాలను వాడుతూ ఉంటారు. వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించడం వల్ల మనం సమస్యను చాలా సలుభంగా అధిగమించవచ్చు. చెమట వాసనను తొలగించడంలో నిమ్మకాయ సమర్థవంతంగా పని చేస్తుంది. స్నానం చేసే నీటిలో నిమ్మరసాన్ని వేసి కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం నుండి చెమట వాసన రాకుండా ఉంటుంది.
అలాగే సువాసనలు వచ్చే సబ్బులు కాకుండా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన సబ్బును వాడడం మంచిది. అలాగే సువాసన వచ్చే పౌడర్ లను, మాయిశ్చరైజర్ లను ఉపయోగించడం తగ్గించాలి. అదే విధంగా గ్రీన్ టీ ని వాడడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. స్నానం చేసే నీటిలో గ్రీన్ టీ ని వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై ఉండే బ్యాక్టీరియాలు నశించి దుర్వాసన రాకుండా ఉంటుంది. అదే విధంగా మనం తీసుకునే ఆహారం కారణంగా కూడా చెమట దుర్వాసన వస్తుంది. కనుక ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం నుండి దుర్వాసన ఎక్కువగా వచ్చే వారు రెడ్ మీట్ ను, మసాలా వంటకాలను, ఆల్కాహాల్ ను తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి.
అలాగే ఎక్కువగా నీటిని తాగాలి. అలాగే రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. అలాగే స్నానం చసే ముందు శరీరానికి కొబ్బరి నూనెను రాసుకోవాలి. ఇలా రాసుకున్న అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగే సోంపు గింజలు నానబెట్టిన నీటిని ప్రతిరోజూ తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరం నుండి వ్యర్థాలు ఎక్కువగా తొలగిపోతాయి. చెమట ఎక్కువగా వాసన రాకుండా ఉంటుంది. ఈ చిట్కాలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా చెమట వాసన రాకుండా చేసుకోవచ్చు.