Castor Oil Home Remedies : ఆముదం నూనెతో ఎన్నో ప్ర‌యోజనాలు.. ఎలా ఉప‌యోగించాలో తెలుసా..?

Castor Oil Home Remedies : మందుల‌తో కూడా త‌గ్గని కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న స‌హ‌జంగా ల‌భించే ప‌దార్థాల‌ను ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు. ఇలా మందుల‌కు సైతం త‌గ్గ‌ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే సామ‌ర్య్థం ఉన్న వాటిలో ఆముదంనూనె కూడా ఒక‌టి. ఆముదం నూనె అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా… కానీ మీరు విన్న‌ది నిజ‌మే. ఆముదం నూనె మ‌నంద‌రికి తెలిసిందే. ఎన్నో ఏండ్లుగా దీనిని మ‌నం ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఆముదం చెట్టు గింజ‌ల నుండి తీసే ఈ ఆముదం నూనె ఎన్నో ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను, పోష‌కాల‌ను క‌లిగి ఉంది. ఆముదం నూనెలో రిసినోలియెక్ ఆమ్లం, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఇలా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.

గుండె జ‌బ్బులు, చ‌ర్మ స‌మ‌స్య‌లు, జుట్టు స‌మ‌స్య‌లు, దుర‌ద‌, వాపు, నొప్పులు, విష జ్వ‌రాలు, నులిపురుగులు, మ‌ల‌బ‌ద్ద‌కం ఇలా అనేక అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఆముదం నూనె మ‌న‌కు దోహ‌ద‌పడుతుంది. ఆముదం నూనె వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. దీనిని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం నూనెను వాడ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించి నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఆముదం స‌హాయ‌ప‌డుతుంది. దీని కోసం ఒక మెత్త‌టి వ‌స్త్రాన్ని ఆముదం నూనెలో ముంచి నొప్పులు ఉన్న గట్టిగా క‌ట్టాలి. త‌రువాత దీనిపై వేడి నీటితో కాప‌డం పెట్టుకోవాలి. ఇలా చేయ‌డంవ‌ల్ల నొప్పులు త‌గ్గిపోతాయి. ఆముదాన్ని వాడ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డుతుంది.

Castor Oil Home Remedies amazing health benefits
Castor Oil Home Remedies

మ‌నం తీసుకునే ఆహారంలో భాగంగా ఆముదాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్, నులిపురుగులు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పొట్ట మొత్తం శుభ్ర‌ప‌డుతుంది. అలాగే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఆముదం దోహ‌ద‌ప‌డుతుంది. ఆముదంలో అన్ డీసైక్లీనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తామ‌ర‌, దుర‌ద వంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఒక గిన్నెలో ఆముదం నూనెను తీసుకుని దానికి స‌మానంగా కొబ్బ‌రి నూనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను చ‌ర్మ‌స‌మ‌స్య‌లు ఉన్న చోట త‌రుచూ రాయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అదే విధంగా ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లో 2 టీ స్పూన్ల ఆముదం క‌లిపి ప‌ర‌గ‌డుపున తాగాలి. దీనిని తాగిన అర‌గంట త‌రువాత ఒక గ్లాస్ నీటిని తాగాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటిని తాగుతూ ఉండాలి.

ఇలా చేయ‌డం వల్ల ఫుడ్ పాయిజ‌న్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అదే విధంగా గాయాల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఆముదం మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఇన్పెక్ష‌న్ రాకుండా అడ్డుకోవ‌డంలో ఆముదం ఉప‌యోగ‌ప‌డుతుంది. దూదిని ఆముదంలో ముంచి గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. న‌డుము నొప్పితో బాధ‌పడే వారు నొప్పి ఉన్న చోట ఆముదం నూనెతో 10 నుండి 15 నిమిషాల పాటు సున్నితంగా మ‌ర్ద‌నా చేసుకోవాలి. త‌రువాత వేడి నీటితో కాప‌డం పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల న‌డుము నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ ఆముదం క‌లిపి ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌ప‌డ‌డంతో పాటు శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. ఈ విధంగా ఆముదం నూనె మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని వాడ‌డం వల్ల మొండి వ్యాధులు సైతం త‌గ్గుతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts