Chia Seeds For Belly Fat : దీన్ని తీసుకుంటే చాలు.. పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన ఎలాంటి కొవ్వు అయినా స‌రే క‌రుగుతుంది..!

Chia Seeds For Belly Fat : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఎక్కువ‌సేపు కూర్చొని ప‌ని చేయ‌డం వంటి వివిధ కార‌ణాల చేత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయి. వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవకాశం ఉంది. గుండెపోటు, ర‌క్తపోటు, షుగ‌ర్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక అధిక బ‌రువును అలాగే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఎంత త్వ‌ర‌గా తొల‌గించుకుంటే అంత మంచిది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తొల‌గించుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు.

అయిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు కింద చెప్పిన ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే ఈ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఉప‌యోగించాల్సిన ఒకే ఒక ప‌దార్థం చియా విత్తనాలు. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. చియా విత్త‌నాలు మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ లో, అన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బ‌రువు, హైపో థైరాయిడిజం, షుగ‌ర్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. దీని కోసం ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ చియా విత్త‌నాల‌ను వేసి అర గంట నుండి ఒక గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె క‌లిపి తీసుకోవాలి.

Chia Seeds For Belly Fat know how to take them
Chia Seeds For Belly Fat

ఇలా నీటిని తాగుతూ చియా విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. ఈ విత్త‌నాల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇలా చియా విత్త‌నాల‌ను తీసుకుంటూనే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ప్ర‌తిరోజూ అర‌గంట పాటు వ్యాయామం చేయాలి. మంచి జీవ‌న విధానాన్ని పాటించాలి. పొట్ట అధికంగా ఉన్న వారు ఈ విత్త‌నాల‌ను రెండు పూట‌లా తీసుకోవ‌చ్చు. ఉద‌యం అల్పాహారాన్ని అర‌గంట ముందు అలాగే రాత్రి భోజ‌నం చేసిన రెండు గంట‌ల త‌రువాత వీటిని తీసుకోవ‌చ్చు. పొట్ట చుట్టూ కొవ్వు త‌క్కువ‌గా ఉన్న వారు ఉద‌యం పూట తీసుకుంటే స‌రిపోతుంది. ఇలా చియా విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును అలాగే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts