Cloves : భారతీయులు నిత్యం వాడుతున్న మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. వీటిని మసాలా దినుసులుగా కాకుండా ఔషధ పదార్థంగా చూడాలి. ఎందుకంటే లవంగాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి. వీటిలో ఉండే ఔషధ విలువల కారణంగా వీటిని రోజూ తీసుకుంటే అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం లవంగాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
లవంగాలను పొడి చేసి తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పురుషుల్లో ఉండే శృంగార సమస్యలు తొలగిపోతాయి.
లవంగాల్లో అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి అనేక మినరల్స్ లవంగాల్లో ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. అనేక వ్యాధులను తగ్గించేందుకు సహకరిస్తాయి.
లవంగాలను తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్, షుగర్, బీపీ లెవల్స్ తగ్గిపోతాయి. షుగర్ ఉన్నవారికి లవంగాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. లవంగాలు శరీరంలో ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. లవంగాల్లో ఉండే ఔషధ గుణాలు హైబీపీని తగ్గిస్తాయి.
లవంగాల ద్వారా ప్రయోజనాలను పొందాలంటే వాటిని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం పరగడుపునే 2 లవంగాలను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. లేదా కొద్దిగా పొడి చేసుకుని అందులో తేనె కలిపి ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. దీంతో పైన తెలిపిన అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
లవంగాలను ఈ విధంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణాశయంలో ఎంజైమ్‌లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి.
రాత్రి పూట 2 లవంగాలను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగార సమస్యలు తగ్గుతాయి.
పురుషులు రోజూ లవంగాలను ఈ విధంగా తీసుకోవడం వల్ల వారిలో వీర్యం వృద్ధి చెందుతుంది. అయితే లవంగాలకు రోజుకు 2 మించి తీసుకోరాదు. తీసుకుంటే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మోతాదులో తింటే ప్రయోజనాలను పొందవచ్చు.