Common Cold : పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు.. ద‌గ్గు, జ‌లుబును క్ష‌ణాల్లో మాయం చేసే చిట్కా..!

Common Cold : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా ద‌గ్గు, జ‌లుబు, క‌ఫం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ఈ వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా మ‌నం అనేక ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటాం. మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మ‌నం త‌ర‌చూ ఇలా ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటాం. రోగ నిరోధ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఇవే కాకుండా మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్ల‌య బారిన కూడా ప‌డుతూ ఉంటాం. మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం.

త‌గినంత వ్యాధి నిరోధ‌క‌త ఉండ‌డం వ‌ల్ల మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఇంట్లో త‌యారు చేసుకున్న ఒక మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. అలాగే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుండి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబుల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ద‌గ్గు, జ‌లుబుల‌ను త‌గ్గించే ఈ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం బాదం ప‌ప్పును, రెండు ఎండు ఖ‌ర్జూరాల‌ను, అల్లం ర‌సాన్ని, బెల్లం తురుమును, బ్లాక్ సాల్ట్ ను, ప‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది.

Common Cold effective home remedy for everyone
Common Cold

అల్లం ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ముందుగా జార్ లో బాదం ప‌ప్పు, గింజ‌లు తీసేసిన ఎండుఖ‌ర్జూరాల‌ను వేసి పొడ చేసుకోవాలి. త‌రువాత‌ ఒక గిన్నెలో అల్లం ర‌సాన్ని వేసి వేడి చేయాలి. అల్లం ర‌సం వేడ‌య్యాక అందులో మిక్సీ ప‌ట్టుకున్న బాదం, ఖ‌ర్జూరాల పొడిని వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత బెల్లం తురుము వేసి క‌లపాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ఉప్పును వేసి క‌ల‌పాలి. ఈ మివ్ర‌మాన్ని ద‌గ్గ‌ర ప‌డే ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఎక్కువ మోతాదులో త‌యారు చేసుకుని 4 నుండి 5 రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. కానీ తాజాగా, గోరు వెచ్చ‌గా తీసుకుంటేనే మ‌నం అధిక ప‌లితాన్ని పొంద‌వ‌చ్చు.

5 నుండి 6 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు ఈ మిశ్ర‌మాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో మూడు పూట‌లా ఇవ్వాలి. పెద్ద‌వారు ఈ మిశ్ర‌మాన్ని రెండు టీ స్పూన్ల‌ మోతాదులో మూడు పూట‌లా తీసుకోవాలి. ఇలా రెండు రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ ల బారిన నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. దీనిని తీసుకున్న మొద‌టి రోజే ద‌గ్గు త‌గ్గ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఛాతిలో పేరుకుపోయిన క‌ఫం కూడా తొల‌గిపోతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌లికాలంలో, వ‌ర్షాకాలంలో వ‌చ్చే ద‌గ్గు, జలుబుల‌ను త‌గ్గించ‌డంలో ఈ చిట్కా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

D

Recent Posts