Dry Dates : సహజ సిద్దంగా తియ్యటి రుచిని కలిగి ఉండే వాటిల్లో కర్జూరాలు ఒకటి. ఇవి మధురమైన రుచిని కలిగి ఉంటాయి. కర్జూరాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం పండు కర్జూరాలతో పాటు ఎండిన కర్జూరాలను కూడా తింటూ ఉంటాం. తీపి పదార్థాల తయారీలో కూడా ఈ ఎండు కర్జూరాలను వాడుతూ ఉంటాం. ఎండు కర్జూరాలలో కూడా పోషకాలు ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే ఎండు కర్జూరాలను నేరుగా తీసుకోవడానికి బదులుగా వాటిని నీటిలో నానబెట్టి తీసుకుంటే మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పడుకునే ముందు ఎండు కర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల అవి అత్యంత ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఔషధంగా మారిపోతాయని వారు చెబుతున్నారు. ప్రతిరోజూ మూడు నుండి ఐదు నానబెట్టిన కర్జూరాలను ఉదయం పరగడునున తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. నానబెట్టిన కర్జూరాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్జూరంలో ఉండే ఖనిజాలు ఎముకలను బలంగా తయారు చేయడంలో, ఎముకలను బలహీనపరిచే వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి. కర్జూరాలను తీసుకోవడం వల్ల ప్రేగు సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. కర్జూరాలలో ఉండే ఆమైనో ఆమ్లాలు, పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
అదేవిధంగా కర్జూరాలలో అధికశాతంలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఉపయోగపడతాయి. రక్తహీనత వల్ల కలిగే అలసట, నీరసం వంటి భావాలను తగ్గించి శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. నానబెట్టిన కర్జూర పండ్లను తినడం వల్ల మూత్రం సాఫీగా వస్తుంది. మూత్రాశయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. నానబెట్టిన కర్జూరాలను తినడం వల్ల మలబద్దకం సమస్యను పూర్తిగా నివారించవచ్చు. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలవిసర్జన సాఫీగా అయ్యేలా చేయడంలో తోడ్పడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల బీపీ, అసిడిటి, అల్సర్ వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి ఈ కర్జూరాల్లో మెండుగా ఉంది. కర్జూరాలను తినడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టం తగ్గుతుంది. చర్మం పై ఉండే ముడతలు తొలగిపోయి యవ్వనంగా కనబడతారు. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందాలంటే రాత్రి మూడు నుండి ఐదు కర్జూరాలను నానబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తిని ఆ నీటిని తాగాలి. అప్పుడే కర్జూరాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందగలమని నిపుణులు చెబుతున్నారు.