Curd And Methi For Hair : ఈ రెండింటినీ క‌లిపి జుట్టుకు రాయండి.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!

Curd And Methi For Hair : జుట్టు రాల‌డం త‌గ్గి, జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెర‌గాల‌నుకునే వారు ఈ చిట్కాను పాటించ‌డం వల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం కేవ‌లం రెండు ప‌దార్థాల‌ను మాత్ర‌మే ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఉప‌యోగించేది రెండు ప‌దార్థాలే అయిన‌ప్ప‌టికి ఇవి మ‌న జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా చేసే ఆ చిట్కా ఏమిటి.. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఉప‌యోగించాల్సిన ఆ రెండు ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం మెంతుల‌ను, పెరుగును ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ రెండు ప‌దార్థాలు కూడా మ‌న ఇంట్లో ఉండేవే.

అలాగే ఇవి రెండు కూడా స‌హ‌జ సిద్ద‌మైన‌వే. వీటిలో అనేక పోష‌కాలతో పాటు అనేక ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. మెంతుల‌ను, పెరుగును ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాలు అంది జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అలాగే చుండ్రు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి త‌ల‌చ‌ర్మం ఆరోగ్యంగా మారుతుంది. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు పొడి బార‌కుండా ఉంటుంది. జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. జుట్టు చ‌క్క‌గా ఒత్తుగా, పొడువుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా మెంతుల‌ను మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని రెండు నుండి మూడు టీ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ముప్పావు క‌ప్పు పెరుగును వేసి క‌ల‌పాలి.

Curd And Methi For Hair how to mix and apply know the uses
Curd And Methi For Hair

ఈ మిశ్ర‌మం మ‌రీ గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని పోసి క‌ల‌పాలి. ఇలా రాత్రి ప‌డుకునే ముందు త‌యారు చేసుకుని పెట్టుకోవాలి. ఉద‌యాన్నే ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించాలి. ఆరిన త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు స‌మ‌స్య నివారించ‌బ‌డుతుంది. జుట్టు కుదుళ్లు బ‌లంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. ఈవిధంగా ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

D

Recent Posts