చిట్కాలు

Fennel Seeds For Beauty : సోంపు గింజ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం రెట్టింపు అందంగా మారుతుంది..!

Fennel Seeds For Beauty : ప్రతి ఒక్కరు కూడా, అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండడం కోసం, అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఇంటి చిట్కాలతో, అందాన్ని పెంపొందించుకోవచ్చు. ముఖం అందంగా, తెల్లగా, కాంతివంతంగా మారాలంటే చాలామంది వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా, ఇలా చేస్తే ఈజీగా అందాన్ని పెంపొందించుకోవచ్చు. సోంపు గింజల వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అయితే, బ్యూటీ ప్రయోజనాలు కూడా ఇందులో ఉంటాయి.

సోంపు చర్మ ఛాయని మెరుగుపరచడానికి, బాగా ఉపయోగపడుతుంది. మొటిమల్ని కూడా ఇది తగ్గించగలదు. మచ్చల్ని కూడా పోగొడుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లో కూడా, ఈ సోంపు ని వాడడం జరుగుతుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజీ నుండి రక్షించడానికి, సోంపు బాగా ఉపయోగపడుతుంది. చర్మ కణాల లైఫ్ని పెంచుతుంది. సోంపు గింజలు లో రాగి, పొటాషియంతో పాటుగా క్యాల్షియం, జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మొటిమలు, సెల్ డామేజ్, డార్క్ స్పాట్స్, ముడతలు వంటి బాధ నుండి ఈజీగా బయటపడొచ్చు.

do like this with fennel seeds for beauty

సోంపుని మెత్తగా పొడి కింద తయారు చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని, సోంపు పొడి వేసి అర స్పూన్ తేనె, అర స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేయండి. దీనిని ముఖానికి రాసేసి, ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేయండి. 10 నిమిషాలు అయిన తర్వాత, చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోండి.

వారానికి రెండుసార్లు మీరు ఇలా చేస్తే, మంచి ఫలితం ఉంటుంది. అరకప్పు నీటిలో, ఒక స్పూన్ సోంపు గింజలు పొడి వేసి మరిగించి, ఆ నీటిని వడకట్టేసుకుని చల్లారాక నిమ్మరసం కలిపి ఇందులో కాటన్ బాల్ ని ముంచి, ముఖం, మెడ చేతులకి ఈ నీటితో తుడుచుకోండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోండి. ఇలా చేయడం వలన దురద, దద్దుర్లు వంటివి తొలగిపోతాయి. ట్యాన్ వంటి సమస్యలు కూడా పోతాయి.

Admin

Recent Posts