mythology

తిరుమ‌ల శ్రీ‌వారి విగ్ర‌హానికి గ‌డ్డంపై ప‌చ్చ‌క‌ర్చూరం, చంద‌నం ఎందుకు పెడ‌తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏడు కొండల పై వెలిసిన శ్రీ వేంకటేశ్వరుని దేవాలయం విశ్వ విఖ్యాత మైంది&period; ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో తిరుపతి పట్టణంలో కలదు&period; ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా లక్షలాది యాత్రికులు దర్సిన్చుకుంటారు&period; భగవంతుడు శ్రీనివాసుడికి తమ ముడుపులు&comma; కానుకలు సమర్పించి స్వామీ ఆశీస్సులు పొందుతారు&period; తిరుపతి ఏడు కొండలపై నివాసుడైనా విశ్వమందున్న అనేక భక్తులకు కల్పతరువుగా&comma; వరాల వేల్పుగా అందరికి తెలుసు&period; తల నీలాలనుండి&comma; క్యూలో దర్శనం దాకా ప్రతివారి జీవితంలోనే మరపురాని దృశ్యాలుగా మనసులో చెదరని ముద్రవేస్తాయి&period; తిరుపతి లడ్డు అన్నపేరు వినగానే ఆ మధురమైన రుచి మనకి జ్ఞాపకం వస్తుంది&period; తిరుపతి చేరగానే లక్షలాది భక్తుల గోవిందా&excl; గోవిందా&excl; అన్న భక్తి చైతన్యపు పిలుపులు మనకి వినిపిస్తుంటాయి&period; ఆ మంత్రం అప్రయత్నంగా మన నోట కూడా పలకడం ప్రారంభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిరుపతి వెళ్ళడం భక్తిలోనే కాదు&comma; సన్స్కృతిలో కూడా భాగం అనిపిస్తుంది&period; శ్రీ వెంకటేశ్వరుని లీలా విశేషాలు&comma; భక్తులు అద్భుత అనుభవాలు చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు కదా&excl; తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు&period; దీనివెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మీకు తెలుసా&quest;&quest; అయితే ఈ కథనం చదవండి&period;&period; శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్&period; శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు&period; ఈయన స్వామి వారికి రోజూ పూలమాలాలు సమర్పించేవారు&period; అనంతాళ్వారు తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులలో అగ్రగణ్యుడు&period; భగవద్రామానుజుల ఆజ్జమేరకు స్వామికి పుష్పమాల కైంకర్యం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేశాడు&period; స్వామికి పూలమాలను అల్లటానికి ఆయన ఒక పూలతోటను పెంచదలచినాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91617 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-venkateshwara-1&period;jpg" alt&equals;"why pacha karpuram will be put on lord venkateshwara beard " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ పూతోట పెంపకానికి సరిప‌à°¡à°¾ నీరు అందించడానికి ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని&comma; చెరువు తవ్వడం మొదలు పెడుతాడు&period; ఇతరుల సహాయం తీసుకోకుండా&comma; తాను&comma; తన ధర్మపత్ని మాత్రమే ఆ చెరువును తవ్వాలని సంకల్పం చేసుకొని కార్యం ఆరంభిస్తాడు&period; అనంతాళ్వారు గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే అతని భార్య గంపలలో ఎత్తుకొని వెళ్లి దూరంగా ఆ మట్టిని పోసేది&period; ఆ సమయంలో ఆమె నిండు చూలాలు&period; ఆమె పరిస్థితిని చూపిన శ్రీ వెంక‌టేశ్వరుడు వారివురికి సహాయపడటానికి ఒక పన్నెండేళ్ల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు&period; ఆ గర్భిణికి సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని పారబోయేటంలో సహాయపడతాడు&period; ఈ విషయం తెలుసుకున్న అనంతాళ్వారు కోపంతో ఆ బాలుడిపైకి గునపాన్ని విసురుతాడు&period; ఆ గునపం బాలుని గడ్డానికి తగిలి రక్తం స్రవిస్తుంది&period; అంతలోనే ఆ బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్లి కనబడకుండా దాక్కుంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీవారి ఆలయంలో అర్చకులు స్వామి వారి విగ్రహంలో గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు తెలియజేస్తారు&period; జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆలయానికి చేరుకున్న అనంతాచార్యులు&comma; గర్భాలయంలోని మూలమూర్తి గడ్డం నుంచి రక్తం వస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోతాడు&period; తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు&comma; సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడని గ్రహించి కన్నీళ్లతో స్వామి పాదాలపై పడతాడు&period; తనని మన్నించమని కోరుతూనే&comma; గాయం వలన స్వామికి కలుగుతోన్న బాధ ఉపశమించడం కోసం అక్కడ పచ్చకర్పూరం అద్దుతాడు&period; అలా ఆయన ప్రతి రోజూ చల్లదనం కోసం గాయమైన చోట గడ్డానికి చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు&period; అలా స్వామివారి మూలమూర్తికి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది&period; అప్పటినుంచి స్వామివారి గడ్డం పై రోజూ పచ్చకర్పూరం అద్దుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికీ మనం అనంతాళ్వారులు స్వామివారి మీద విసిరిన గునపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వెళ్ళాడుతూ ఉండటం చూడవచ్చు&period; శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనకవైపు ఉంటుంది&period; మనం అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు&period; శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts