Fenugreek Seeds For Weight Loss : మెంతులను ఉపయోగించి మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, అధిక బరువును తగ్గించుకోవచ్చని మీకు తెలుసా… ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వంటి అనేక కారణాల చేత మనలో చాలా మంది శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది.
అయితే ఈ అధిక బరువు సమస్యను అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును మన వంటింట్లో ఉండే మెంతులను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఈ మెంతులను ఎలా వాడడం వల్ల మనం ఈ అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒకటిన్నర స్పూన్ మెంతులను వేసుకోవాలి. ఈ నీటిని చిన్న మంటపై 3 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. మెంతులను వేసి వేడి చేయడం వల్ల నీళ్లు రంగు మారడాన్ని మనం గమనించవచ్చు.
తరువాత ఈ నీటిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మెంతుల నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. అలాగే ఈ నీటిని తీసుకున్న గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఉదయం వీలుకాని వారు ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. కానీ ఈ పానీయాన్ని ఉదయం పూట తీసుకుంటేనే మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. అధిక బరువు అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ మెంతుల నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ మన జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
శరీరంలో జీవక్రియల రేటును పెంచి తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే అనేక అనారోగ్య సమస్యలక కారణమైన మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. మెంతులను వాడడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఇలా మెంతుల నీటిని క్రమం తప్పకుండా ఒక నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. అయితే ఆస్థమా సమస్యతో బాధపడే వారు, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ పానీయాన్ని తీసుకోకపోవడమే మంచిది.