చిట్కాలు

ఎండ కార‌ణంగా శ‌రీరంలో విప‌రీతంగా వేడి ఉంటుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

శరీరంలో నీటిశాతం తగ్గితే అనవసరమైన ఇబ్బందులని వస్తుంటాయి. అందుకే శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. రోజుకి 8నుండి పది గ్లాసుల నీళ్ళైనా తాగాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఐతే కొందరు ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. అవును, నీళ్ళు తాగడాన్ని మర్చిపోయే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా, నీళ్ళు మాత్రమే తాగడానికి సంకోచిస్తారు. అలాంటప్పుడు మన శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. జీలకర్ర శరీర వేడిని బాగా తగ్గిస్తుంది. అందుకే పొద్దున్న లేవగానే జీలకర్ర, కండచక్కెర కలుపుకుని నీళ్ళు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో నీటిశాతం మెరుగ్గా ఉంటుంది. తొందరగా నిర్జలీకరణం అవకుండా ఉండి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగనివ్వదు.

శరీరాన్ని చల్లగా ఉంచే మరో అద్భుతమైన ఆయుర్వేద మూలిక నిమ్మగడ్డి, జీర్ణక్రియని పెంచి, నిర్జలీకరణం అవకుండా చూసుకుంటుంది. నిమ్మగడ్డితో తయారు చేసిన టీ అయినా బాగుంటుంది. ఆల్కహాల్ వంటి పదార్థాలకి దూరంగా ఉండాలి. శరీరంలోకి ఆల్కహాల్ వెళ్ళిందంటే అది డీహైడ్రేషన్ కి దారితీస్తుంది. వచ్చింది వేసవికాలం కాబట్టి ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండడమే బెటర్.

follow these remedies if you have heat in your body

చల్లని నీళ్ళు అనగా రిఫ్రిజిరేటర్లోని నీళ్ళు తాగవద్దు. కావాలంటే కుండలోని నీళ్ళు తాగండి. ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్ వంటివి తినవద్దు. చక్కెర ఎక్కువగా ఉండే మార్కెట్లో దొరికే పానీయాలని తాగకుండా ఉండండి. దానికి బదులు కొబ్బరి బొండాం, ఇంట్లో చేసిన నిమ్మరసం, షర్బత్, పెరుగుతో చేసిన మజ్జిగ లాంటి వాటిని పానీయాలుగా తాగండి.

Admin

Recent Posts