వినోదం

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత దురదృష్టవంతులైన నటీనటులు ఎవరు?

<p style&equals;"text-align&colon; justify&semi;">1970లకి పూర్వ తరంలో వచ్చిన కొంత మంది పెద్ద నటులు చివరి రోజులలో ఆర్థికంగా చాలా కష్టాలు పడిన వారు ఉన్నారు&period; వారిలో నాకు తెలిసిన కొందరి పేర్లు కింద వ్రాస్తున్నా&period; చిత్తూరు నాగయ్య&colon; నాగయ్య సినిమాలలో ఎన్నో ఉన్నత శిఖరాలు చూసారు&period; రామారావు&comma; నాగేశ్వర రావు కన్నా ముందు ఆయన తెలుగు లో మొదటి పెద్ద హీరో&period; తెలుగు సినిమాలలో మొదటి సారిగా లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న నటుడు ఆయన&period; దక్షిణ భారత దేశం లో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి నటుడు ఆయన&period; ఆయన నటించిన యోగి వేమన&comma; త్యాగయ్య&comma; గృహ లక్ష్మి మున్నగు సినిమాలు ఏంతో ప్రజాధారణ పొందాయి&period; ఆయన చివరి నాళ్లలో అనుభవించిన ఆర్థిక కష్టాలు చాలానే ఉన్నాయి&period; ఒకప్పుడు ఆయనికి మద్రాస్ నగరంలో ఏభై ఎకరాలు మామిడి తోట ఉండేది&period; అలాంటిది ఆయన సినిమా నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి ఆర్థికంగా బాగా దెబ్బ తిని చివరికి డబ్బులు లేకుండా చనిపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాంచనమాల&colon; తెలుగు తెరకి మొదటి గ్లామరస్ హీరోయిన్ గా మరియు స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి కాంచనమాల&period; శ్రీ శ్రీ మహా ప్రస్థానంలో సైతం కాంచన మాల ప్రస్తావన ఉంటది&period; అలాంటి కాంచనమాల 1941లో జెమినీ వాసన్ అనే నిర్మాతతో అయ్యిన గొడవ వల్ల నాలుగేళ్లు సినిమాలకి దూరం కావాల్సి వచ్చింది&period; వాసన్ తో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల ఆవిడ వాసన్ సినిమాలలోను మరియు బయట నిర్మాతలకి ఇద్దరికీ పని చేయలేక పోయారు&period; అదే సమయంలో ఆవిడ భర్త కూడా చనిపోడం వల్ల ఆవిడ మతి స్థిమితం కోల్పోయి తన సొంతూరు అయిన తెనాలి వెళ్లి అక్కడే చుట్టాల ఇంట్లో ఉండి జనాలు ఎవరితోనూ కలవకుండ 40 ఏళ్ళు ఉండి చివరికి కాలం చేశారు&period; కస్తూరి à°¶à°¿à°µ రావు&colon; ఈయన సినిమాలలో హాస్య నటుడిగా వచ్చి కొన్ని హిట్లు కొట్టి మంచి పేరు తెచ్చుకున్నారు&period; నిర్మాతగా మారి పరమానందయ్య శిష్యుల కథ తీసి ఆ సినిమాలో చాలా నష్టాలు చవి చూసి ఉన్న ఆస్తులు ఇంకా buick కార్ కూడా అమ్మేసారు&period; ఆ తరువాత బ్రతుకు తెరువు కోసం ఆయన మళ్లీ నాటకాలు వేయడం మొదలు పెట్టి తెనాలిలో నాటకం వేస్తూ చనిపోయారు&period; అప్పుడు ఆయన శవాన్ని కార్ డిక్కీలో మద్రాస్ తరలించారు&period; అక్కడ ఆయన అంతిమ సంస్కారాలకి కూడా డబ్బులు లేక చందాలు వేసుకుని అంతిమ సంస్కారాలు చేసారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81291 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actors-10&period;jpg" alt&equals;"these are the unlucky actors in telugu film industry " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హాస్యనటి గిరిజ&colon; ఈవిడ హాస్య నటుడు రేలంగితో కలిసి కామెడీ పెయిర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు&period; ఎంతో విలాసవంతమైన జీవితం గడిపారు&period; కానీ తరువాత ఆవిడ తన భర్తతో కలిసి నిర్మాతగా మారారు&period; ఆవిడ తీసిన సినిమాలు అన్ని పరాజయం పొంది ఆర్థికంగా దెబ్బ తిన్నారు&period; భర్త&comma; కూతురు కూడా దూరం అయ్యి చివరికి పది చదరపు అడుగుల గదిలో చివరి రోజులు గడిపారు&period; కాంతారావు&colon; కాంతరావు జీవితం గురించి అందరికి తెలిసిందే&period; జానపద సినిమాలు అంటే ఎన్టీఆర్ తరువాత మనకి గుర్తుకొచ్చేది కాంత రావు గారే&period; ఒకప్పుడు మద్రాస్ నగరంలో విలాసమైన ఇల్లు మరియు జీవితం అనుభవించిన ఆయన తరువాత కాలంలో నిర్మాతగా డబ్బులు పోగొట్టుకుని హైదరాబాద్ చిక్కడపల్లిలో కిరాణా కొట్టు పెట్టుకుని జీవించారు&period; ఆయన చనిపోయాక కూడా ఆయన కుటుంబ సభ్యలు తెలంగాణ ప్రభుత్వానికి ఒక్క ఇల్లు ఇవ్వమని విన్నవించుకోడం ఇంకో దురదృష్టకరమైన విషయం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజనాల కల్లయ్య&colon; తెలుగు తెర మీద అత్యంత పేరు గడించిన తొలి తరం విలన్&period; ఎన్నో రాజభోగాలతో ఎంతో విలాసంగా బ్రతికిన జీవితం&period; ఈయన సినిమా నిర్మాణంలో డబ్బులు పోగొట్టుకోలేదు కానీ చెడు అలవాట్లు వల్ల ఆర్థికంగా చితికి పోయారు అని విన్నా&period; ఆయన కొడుకులు ఒకరు చిన్న వయసులోనే చనిపోతే à°®‌రొకరు ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్లి తిరిగిరాలేదంటే ఆయన జాడ ఆ తరువాత తెలియలేదంట&period; చివరి రోజులలో ఆయన హైదరాబాద్ అమీర్ పేటలో ఒక్క చిన్న గదిలో శేష జీవితం గడిపారు అని అప్పట్లో చాలా పత్రికలలో వచ్చింది&period; పద్మనాభం గారు&colon; ఈయన కూడా నిర్మాతగా మారి చేయి కాల్చుకున్నారు&period; ఆయన ఆర్థిక కష్టాలు గురించి ఆయనే చక్రం సినిమాలో ఒక్క డైలాగ్ కూడా చెప్పారు&period; వీరే కాకుండా సావిత్రి&comma; సిల్క్ స్మిత&comma; కటారు నాగభూషణం&comma; రక్త కన్నీరు నాగ భూషణం లాంటి వారి జీవితాలు కూడా కష్టంగానే ముగిశాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts