1965లో నాసా చేసిన జెమిని 3 మిషన్‌లోని మెనూ: డీహైడ్రేటెడ్ రోస్ట్ బీఫ్, బేకన్ మరియు గుడ్డు స్నాక్స్, టోస్ట్ చేసిన బ్రెడ్ క్యూబ్స్ మరియు నారింజ రసం. నేడు, మెనూలు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి మరియు గౌర్మెట్ చెఫ్‌లు తరచుగా వైవిధ్యమైన సృష్టిల వెనుక ఉన్నారు. అంతరిక్ష కేంద్రంలో చాలా నెలలు ఉండే సమయంలో, మంచి ఆహారం సానుకూల మానసిక స్థితికి గణనీయంగా దోహదపడుతుంది.
తినడానికి ముందు తిండిని పౌచ్‌లలో వేడి చేస్తారు. వాటితో పాటు ఇన్‌స్టంట్ కాఫీకి వేడి నీరు కలిపి సేవిస్తుంటారు. స్నాక్స్‌లో నట్స్, డ్రై ఫ్రూట్స్ మరియు ఎనర్జీ బార్‌లు ఉంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి కొత్త షిప్‌మెంట్ వచ్చినప్పుడు లేదా భూమి కక్ష్యలోని ప్రయోగశాలలో మొక్కలను పెంచుతున్నప్పుడు, తాజా పండ్లు మరియు కూరగాయలు కూడా ఉంటాయి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువకాలం ఉండవలసి వచ్చిన బుచ్ విల్మోర్‌తో కలిసి సునీతా విలియమ్స్, బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్, పౌడర్ మిల్క్, పిజ్జా, రొయ్యల కాక్‌టెయిల్స్, రోస్ట్ చికెన్ మరియు ట్యూనా చేప వంటి వివిధ రకాల ఫ్రీజ్-డ్రై మరియు ప్యాక్ చేసిన ఆహారాలను తిన్నారు. తాజా పండ్లు మరియు కూరగాయలు ప్రతి మూడు నెలలకు పరిమితం చేయబడ్డాయి – ఎందుకంటే, మూడు నెలలకు ఒకసారి మాత్రమే వారికి తాజా ఆహారం భూమి నుండి అందుతుంది కనుక. సునీతా విలియమ్స్ సమోసా, చేపల కూర కూడ తీసుకువెళ్ళిందట.