తన కోపమే తన శత్రువు అనే మాట వినే ఉంటారు. నిద్రకు కూడా కోపం శత్రువే అని చెపుతున్నారు నిపుణులు. నిద్రకు వేళయెరా అని శరీరం చెపుతున్నా.. మైండ్ మాత్రం అప్పుడప్పుడు వినదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కోపంతో అసలు నిద్రపోకూడదని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. అలా చేయడం వలన మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుందని ఉదయం లేవగానే మైండ్ శరీరానికి సహకరించదని చెపుతున్నారు. లండన్ యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన ఓ పరిశోధకుడు తన పరిశోధనల ఆదారంగా ఈ విషయాన్ని ధృవీకరించాడు. కోపంతో నిద్రపోయిన వారి కంటే మాములుగా నిద్రపోయిన వారి మైండ్ వందరెట్లు వేగంగా పని చేసిందని.. ఉదయం ప్రశాంతగా శరీరానికి సహకరించిందని తెలిపారు.
ఒకవేళ నిద్రరాకపోతే ఏం చేయాలో కూడా తెలిపాడు. సమయానికి త్వరగా నిద్రపోవాలంటే ఇలా చేస్తే చిటికెలో నిద్రముంచుకు వస్తుందని తెలిపారు. చిటికెలో నిద్రపట్టాలంటే.. పడుకునే ముందు సాక్సులు వేసుకుని పడుకొండి. గదిలో తక్కువ ఉష్టోగ్రత ఉండేలా చూసుకొండి. ఫోన్ దూరంగా పెట్టుకొని పడుకోండి. వీలైతే స్విచ్ ఆఫ్ చేయడం మేలు.
చల్లటి నీటిలో 30 సెకన్ల పాటు ముఖాన్ని ఉంచండి. ప్రశాంతంగా మీకు నచ్చిన వారిని ఊహించుకుని కళ్లు మూసుకొండి. అలాగే మెల్లిగా మెల్లిగా నిద్రలోకి జారుకొండి. ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో మీకు నిద్రపట్టడం ఖాయం.