Hair Problems : మనలో చాలా మంది వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. చుండ్రు కారణంగా దురద, జుట్టు రాలడం వంటి ఇతర సమస్యలు తలెత్తూ ఉంటాయి. తలపై చర్మం పొడిబారడం, వాతావరణ కాలుష్యం, తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే చాలా మంది తలలో పేల సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. వీటి కారణంగా కూడా దురద, అలర్జీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యల బారిన నుండి బయటపడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు.
అలాగే రసాయనాలు కలిగిన షాపులను వాడుతూ ఉంటారు. ఎటువంటి శ్రమ లేకుండా చాలా సులభంగా మనల్ని వేధించే ఈ రెండు రకాల జుట్టు సంబంధిత సమస్యల నుండి మనం బయటపడవచ్చు. తలలో చుండ్రును, అలాగే పేలను తొలగించడంలో యూకలిప్టస్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. తలలో చర్మంపై ఉండే ఇన్ ప్లామేషన్ ను తగ్గించి చుండ్రును నివారించడంలో, అలాగే పేలు తొలగిపోయేలా చేయడంలో ఈ రెండు నూనెలు చక్కగా పని చేస్తాయని వారు చెబుతున్నారు. ఒక గిన్నెలో 5 ఎమ్ ఎల్ టీ ట్రీ ఆయిల్ ను, అలాగే 5 ఎమ్ ఎల్ యూకలిప్టస్ ను ఆయిల్ ను వేసి కలపాలి. ఈ రెండు నూనెలను వారం రోజుల పాటు రోజూ జుట్టు తలపై చర్మానికి పట్టేలా బాగా పట్టించాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెలను తలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి.
ఈ నూనెలో ఉండే యాంటీ పారాసైటిక్ గుణాల కారణంగా పేలు నశిస్తాయి. అలాగే తలలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. తలలో ఉండే బ్యాక్టీరియాలు నశిస్తాయి. ఇలా వారం రోజుల పాటు తలకు నూనె రాసుకున్న తరువాత చివరి రోజూ వేపాకును పేస్ట్ గా చేసి జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచిన తరువాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. వేపాకులో అలాగే కుంకుడు కాయల్లో ఉండే ఔషధాలు చుండ్రును నివారిస్తాయి. అలాగే దురద, ఇన్ఫెక్షన్, అలర్జీ వంటి సమస్యలను తగ్గిస్తాయి. పేల సమస్య కూడా తగ్గుతుంది. తరచూ షాంపులకు బదులుగా వారానికి రెండు సార్లు కుంకుడుకాయలతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్యతో పాటు పేల సమస్య కూడా మన దరి చేరకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేసారు. కనుక చుండ్రు సమస్యతో అలాగే పేల సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.