Deep Sleep : ఆహారం, నీరు మనకు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మన ఆరోగ్యం మనం తీసుకునే విశ్రాంతి మీద కూడ ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పిల్లలో కూడా ఈ సమస్యను మనం చూడవచ్చు. నిద్రలేమి సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన, మనం తీసుకునే ఆహారం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, ఎక్కువగా టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ వంటి వాటిని ఉపయోగించడం, తరచూ ప్రయాణాలు చేయడం వంటి కారణాల చేత నిద్రలేమి తలెత్తుతుంది. అలాగే మనల్ని వేధిస్తున్న ఇతర అనారోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, మనం వాడే మందులు ఇలా అనేక రకాల కారణాల చేత చాలా మంది నిద్రలేమి బారిన పడుతున్నారు.
మనం రోజుకు కనీసం 7 నుండి 8 గంటల వరకు నిద్రించాలని అప్పుడే మెదడు చక్కగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం అనేక ఇతరత్రా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా తలనొప్పి, అల్జీమర్స్, మతిమరుపు, కోపం, చికాకు, రోజంతా నీరసంగా ఉండడం వంటి అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా ఈ నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మనం నిద్రించేటప్పుడు ఎక్కువగా వెలుతురు లేకండా చూసుకోవాలి. వెలుతురు లేకపోవడం వల్ల మెదడు డియాక్టివేట్ అయ్యి నిద్ర తొందరంగా వస్తుంది. అలాగే మన చుట్టూ ఎటువంటి శబ్దం లేకుండా చూసుకోవాలి. అదే విధంగా మనం ఉపయోగించే దిండ్లు, బెడ్ షీట్స్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే బిగితుగా ఉండే దుస్తులు కాకుండా, మనకు వీలుగా, అనుగుణంగా, మెత్తగా ఉండే దుస్తులను ధరించాలి. ఇక రాత్రి పూట సులవుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. నిద్రపోవడానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అదే విధంగా మనం నిద్రించే గదిలో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. అలాగే గదిలో మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే సువానవ వచ్చేలా చూసుకోవాలి.
వీటితో పాటు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, చిటకెడు జాజికాయ పొడి, చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. వీటితో పాటు ఒత్తిడి తగ్గేలా యోగా, ధ్యానం వంటివి చేయాలి. అలాగే తగినంత శారీరక వ్యాయామం చేయాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.