Bread Dosa : బ్రెడ్‌తో ఎంతో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Bread Dosa : మ‌నం అల్పాహారంగా త‌యారు చేసే వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం ముందు రోజే పిండిని త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. ప‌ప్పు నాన‌బెట్టి రుబ్బే ప‌నిలేకుండా అప్ప‌టిక‌ప్పుడూ మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా బ్రెడ్ తో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్టైసెస్ – 5, , బొంబాయి ర‌వ్వ – ఒక కప్పు, పుల్ల‌టి పెరుగు – ఒక క‌ప్పు, నీళ్లు – ఒకటిన్న‌ర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – పావు టీ స్పూన్.

Bread Dosa recipe in telugu how to make this
Bread Dosa

బ్రెడ్ దోశ త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ ను తీసుకుని దానికి చుట్టు ఉంటే న‌ల్ల‌టి భాగాన్ని తీసి వేయాలి. త‌రువాత బ్రెడ్ ను ముక్క‌లుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్త‌ని పొడిలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే ర‌వ్వ‌, పెరుగు, ఒక క‌ప్పు నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మ‌రో అర క‌ప్పు నీళ్లు పోసి క‌లిపి దోశ పిండిలా మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. త‌రువాత మూత తీసి ఇందులో ఉప్పు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక ముందుగా నూనె వేసి టిష్యూ పేప‌ర్ తో లేదా కాట‌న్ వ‌స్త్రంతో తుడ‌వాలి. త‌రువాత నీళ్లు చ‌ల్లి తుడ‌వాలి. ఇప్పుడు త‌గిన మోతాదులో పిండిని తీసుకుని పెనం మీద దోశ లాగా వేసుకోవాలి.

దోశ కొద్దిగా కాలిన త‌రువాత బ‌ట‌ర్ లేదా నూనె వేసుకుని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని రెండో వైపు తిప్పి కాల్చుకునే అవ‌స‌రం ఉండ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ దోశ త‌యార‌వుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, ఏదైనా వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా బ్రెడ్ తో దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇంట్లో అంద‌రూ ఎన్ని తినామ్మో తెలియ‌నంత ఇష్టంగా ఈ దోశ‌ల‌ను తింటారు. బ్రెడ్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts