Vastu Tips : ప్రస్తుత తరుణంలో చాలా మంది డబ్బు సంపాదించేందుకు అనేక విధాలుగా కష్టపడుతున్నారు. పగలనక, రాత్రనక కష్టపడి డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుంటున్నారు. అయితే కొందరు ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవడం లేదని.. అనవసరంగా ఖర్చయిపోతుందని విచారిస్తుంటారు. కానీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా.. తప్పులు చేస్తున్నా.. ధనం చేతిలో అసలు నిలవదు. అలాగే ఇతర సమస్యలు కూడా చుట్టుముడతాయి. కనుక ఇంట్లో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఇక ఇంట్లో కింద చెప్పిన విధంగా తప్పులు చేస్తుంటే గనుక అలాంటి వారి ఇంట్లో ధనం ఎప్పటికీ నిలవదు. వెంటనే ఖర్చవుతుంది. మరి చాలా మంది చేసే ఆ తప్పులు ఏమిటంటే..
ఇంట్లో చాలా మంది ప్రధాన ద్వారాన్ని, ఇతర ద్వారాలను ఒకే సైజులో చేయిస్తుంటారు. కానీ అలా చేయించకూడదు. సింహ ద్వారం అంటే ఎల్లప్పుడూ ఇంట్లోని ఇతర ద్వారాల కన్నా పెద్దగానే ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం సైజులో ఇతర ద్వారాల కన్నా కాస్త ఎక్కువ పొడవు, వెడల్పులతో ఉండాలి. అప్పుడే వాస్తు ప్రకారం సెట్ అవుతుంది. లేదంటే వాస్తు దోషం కలుగుతుంది. దీంతో ఇంట్లో ధనం ఉండదు. సమస్యలు వస్తుంటాయి. కనుక ప్రధాన ద్వారాన్ని పెద్దగా చేయించాలి. ఇతర ద్వారాలను సమాన సైజుల్లో చేయించాలి. దీంతో వాస్తు ప్రకారం సరిపోతుంది. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా ధనం బాగా సంపాదిస్తారు.
ఇక కొందరు ఇళ్లలో కుళాయిల నుంచి నీరు ఎల్లప్పుడూ లీకవుతుంటుంది. లేదా ట్యాంకులు, ఇతర పైపుల నుంచి కూడా నీరు లీకవుతుంటుంది. అలా జరిగితే ధనం కూడా అలాగే ఖర్చవుతుందన్నమాట. కనుక ఇంట్లో నీళ్ల లీకేజీలు ఎక్కడా లేకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే సంపాదించిన ధనం ఇంట్లో నిలుస్తుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు.
ఇక చివరిగా కొందరు పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను ఇంట్లోనే స్టోర్ రూమ్‌లో పెడతారు. లేదా వాటిని అతికించి ఉపయోగిస్తుంటారు. ఇలా అయితే చేయరాదు. పగిలిపోయిన వస్తువులను వెంటనే తొలగించుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇలా వాస్తు సలహాలను పాటిస్తే ఎలాంటి దోషాలు ఉండవు. తద్వారా ఆర్థిక సమస్యలే కాదు, ఇతర ఏ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.