Hair Growth Remedy : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే బట్టతల వస్తుంది. పైగా చుండ్రు సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. ఇవే కాకుండా మనల్ని వేధించే మరో సమస్య తెల్ల జుట్టు. తెల్ల జుట్టు కారణంగా చిన్న వయసులోనే పెద్ద వారిగా కనబడతారు. జుట్టు సంబంధిత సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వంటి అనేక కారణాల చేత జుట్టు సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి.
ఇటువంటి జుట్టు సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల షాంపులను, నూనెలను వాడుతూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేక బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. సహజసిద్దంగా కూడా మనం ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలన్నింటిని నయం చేసుకోవచ్చు. జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు సమస్యలన్నింటిని తగ్గించడంలో మందార పువ్వు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ నూనెను తయారు చేసుకోవడానికి మనం కొబ్బరి నూనెను, మందార పువ్వులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో కొబ్బరి నూనెను వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత మందార పువ్వు రేకులను వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత ఈ నూనెను వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దూదిని తీసుకుని మందార నూనెలో ముంచి కుదుళ్లకు అంటేలా బాగా రాయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ మందార నూనె జుట్టు సమస్యలను నివారించి వేగంగా జుట్టు పెరిగేలా చేస్తుంది. ఈ నూనెను వాడడం వల్ల కుదుళ్లు గట్టి పడి జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా నివారించబడుతుంది. ఈ మందార నూనె పొడి జుట్టు ఉన్న వారికి చాలా బాగా పని చేస్తుంది. ఈ నూనెను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ ఖర్చులో జుట్టును అందంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.