చెరకు రసాన్ని చాలా మంది వేసవిలో ఇష్టంగా తాగుతారు. చెరకు భలే తియ్యని రుచిని కలిగి ఉంటుంది. కొందరు చెరకు గడలను అలాగే నమిలి తింటుంటారు. అయితే చెరకు వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక గ్లాసు చెరకు రసానికి ఒక టీస్పూన్ ఆవు నెయ్యి కలిపి కాచి తీసుకోవాలి. బలహీనత వల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది.
2. అప్పుడే తీసిన చెరకు రసాన్ని ఒక గ్లాస్ మోతాదులో తీసుకుంటే గ్రహిణి వ్యాధి (ఒక రకం విరేచనాలు) తగ్గుతుంది.
3. ఒక గ్లాస్ చెరకు రసానికి 2 టీస్పూన్ల ఉసిరికాయల రసం, 2 టీస్పూన్ల తేనె కలిపి తీసుకుంటుంటే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
4. చెరకు రసాన్ని పది చుక్కల మోతాదుగా రెండు ముక్కు రంధ్రాల్లోనూ వేసుకుని పీల్చితే ముక్కు నుంచి రక్తం కారడం తగ్గుతుంది.
5. అర గ్లాస్ తాజా చెరకు రసానికి అర గ్లాస్ లేత కొబ్బరి నీళ్లు, చిటికెడు సున్నం, అర టీస్పూన్ అల్లం రసం కలిపి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.
6. చెరకు గడను దంతాలతో కొరికి, చీల్చి బాగా నమిలి తింటూ ఉంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి.
7. చెరకు గడలను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. లాలాజల గ్రంథులు ఆరోగ్యంగా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365