ప‌సుపును ఈ విధంగా తీసుకుంటే.. అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

ప‌సుపు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ప‌సుపును చాలా మంది పాల‌లో క‌లుపుకుని తాగుతుంటారు. అయితే ఆ విధంగా తాగ‌డం న‌చ్చ‌క‌పోతే ప‌సుపును ట్యాబ్లెట్ల రూపంలోనూ తీసుకోవ‌చ్చు. మార్కెట్‌లో పసుపు ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకోవ‌చ్చు.

take turmeric in this way to get rid of health problems

ఇక ఖాళీ క్యాప్సూల్స్ 00 సైజువి తీసుకుని వాటిలో ప‌సుపు నింపి కూడా ఆ క్యాప్సూల్స్‌ను వాడుకోవ‌చ్చు. వాటిని రోజూ ఉద‌యం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక్క క్యాప్సూల్ చొప్పున వేసుకోవాలి. పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగ‌లేం అనుకునే వారికి ఈ విధంగా ట్యాబ్లెట్ల‌ను తీసుకోవ‌డం ఎంత‌గానో మేలు చేస్తుంది. ప‌సుపును ఈ విధంగా ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాల‌లో ప‌సుపును అయితే త‌క్కువ మోతాదులో క‌లుపుకుని తాగాలి. కానీ అదే ప‌సుపును ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటే పూట పూట‌కూ క‌చ్చిత‌మైన మోతాదులో ప‌సుపును తీసుకుంటాం. క‌నుక అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

2. పాల‌లో క‌ర్‌క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తుంది. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

3. ప‌సుపును ట్యాబ్లెట్ల రూపంలో రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

4. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ప‌సుపును ఈ విధంగా తీసుకుంటేఎంతో ఫ‌లితం ఉంటుంది.

5. లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి ప‌సుపు ఎంత‌గానో మేలు చేస్తుంది. లివ‌ర్‌లోని కొలెస్ట్రాల్‌, వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

6. ప‌సుపును తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌వు.

సూచ‌న‌: ప‌సుపు తీసుకోవ‌డం మంచిదే అయిన‌ప్ప‌టికీ కొంద‌రికి ఇది ప‌డ‌దు. దీంతో క‌డుపునొప్పి, విరేచ‌నాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు పసుపును వాడుకోవ‌డం ఉత్త‌మం. గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు ఇలా పసుపు ట్యాబ్లెట్ల‌ను తీసుకోరాదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts