Healthy Churnam : మనలో చాలా మంది అనేక రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మలబద్దకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, ఆకలి లేకపోవడం, ప్రేగులు పూర్తిగా శుభ్రం కాకపోవడం, కడుపులో మంట వంటి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి జీర్ణ సంబంధిత సమస్యలను అస్సలు తేలికగా తీసుకోకూడదు. వీటిని నిర్లక్ష్యం చేసే మనం భవిష్యత్తుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మనం ఎంతటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పటికి ఆ ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే మన శరీరానికి పోషకాలు చక్కగా అందుతాయి. కనుక మనం జీర్ణాశయాన్ని, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎటువంటి జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటే దాదాపు 46 రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చూర్ణాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల మలబద్దకం, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణసంబంధిత సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించే ఈచూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలి..అలాగే దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..దీనిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చూర్ణాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం జీలకర్రను, వామును, సోంపు గింజలను, నల్ల ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో రెండు టీ స్పూన్ల వామును, రెండు టీ స్పూన్ల జీలకర్రను తీసుకోవాలి. తరువాత వీటిని చిన్న మంటపై 2 నిమిషాల పాటు వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ జార్ లో రెండు టీ స్పూన్ల సోంపు గింజలు, తగినంత నల్ల ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక గాజు సీసాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలపాలి. ఈ నీటిని రాత్రి భోజనం చేసిన గంట తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల ఉదయాని కల్లా ప్రేగుల్లో పేరుకుపోయిన మలం అంతా తొలగిపోతుంది. ప్రేగులు శుభ్రపడతాయి. ఆకలి బాగా వేస్తుంది. అజీర్తి సమస్య తలెత్తకుండా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. ఈవిధంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో చూర్ణాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల అనేక రకాల జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.