Home Remedies : ప్రస్తుత తరుణంలో చాలా మంది దంత సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే దంతాలు పసుపు రంగులో ఉండే సమస్యతో అనేక మంది ఇబ్బందులకు గురవుతుంటారు. దంతాలు పసుపు రంగులో ఉంటే చూసేందుకు ఏమాత్రం సౌకర్యంగా ఉండదు. దీంతో నలుగురిలో తిరగాలన్నా వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఇందుకు చింతించాల్సిన పనిలేదు.
దంతాలు పసుపు రంగులో ఉన్నవారు ఓ చిట్కాను పాటిస్తే దాంతో దంతాలు తెల్లగా మారిపోతాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గిన్నె తీసుకుని అందులో అర టీస్పూన్ పసుపు వేయాలి. అందులోనే అర టీస్పూన్ ఉప్ప కలపాలి. మరో పావు టీస్పూన్ బేకింగ్ సోడాను వేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమంతో రోజూ దంతాలను తోముకోవాలి. ఇలా కనీసం 10 రోజుల పాటు చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.
ఈ మిశ్రమంలో ఉండే పసుపు యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. ఇక ఈ మిశ్రమం దంతాలను తెల్లగా మెరిసేలా చేయడంలో సహాయ పడుతుంది. దీన్ని రోజూ క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కచ్చితంగా దంతాలు తెల్లగా మారుతాయి.