Home Remedies : చ‌లికాలంలో ఆక‌లి అస్స‌లు ఉండ‌దు.. ఆక‌లి పెరిగేందుకు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Home Remedies : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. శీతాకాలం క‌నుక శ్వాస‌కోశ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు వంటివి బాధించ‌డం స‌హ‌జ‌మే. ఇక ఈ కాలంలో జీవ‌క్రియ‌లు కూడా మంద‌గిస్తాయి. క‌నుక జీర్ణ‌క్రియ స‌రిగ్గా ఉండ‌దు. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. అలాగే ఆక‌లి కూడా ఉండ‌దు. ఏదీ తినాల‌నిపించ‌దు. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతోపాటు ఆక‌లి కూడా పెరుగుతుంది. మరి మ‌నం పాటించాల్సిన ఆ చిట్కాలు ఏమిటంటే..

Home Remedies : చ‌లికాలంలో ఆక‌లి అస్స‌లు ఉండ‌దు.. ఆక‌లి పెరిగేందుకు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

1. ఒక టీస్పూన్ బెల్లం పొడిలో అర టీస్పూన్ మిరియాల పొడి క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీంతో జీర్ణ‌క్రియ సాఫీగా జ‌రుగుతుంది. తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. ఆక‌లి పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కూడా ఉండ‌దు. స‌మ‌స్య‌లు త‌గ్గేవ‌ర‌కు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవాలి.

2. ఒక టీస్పూన్ అల్లం ర‌సంలో కొద్దిగా సైంధ‌వ ల‌వ‌ణం క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. 10 రోజుల పాటు ఇలా చేస్తే ఆక‌లి పెరుగుతుంది.

3. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో ఉసిరికాయ ర‌సం, నిమ్మ‌ర‌సం, తేనెల‌ను ఒక టీస్పూన్ చొప్పున తీసుకుని బాగా క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ స‌మ‌స్య‌లు ఏవీ ఉండ‌వు.

4. రోజూ తాగే టీలో కొద్దిగా యాల‌కుల పొడి క‌లిపి తాగుతుంటే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. లేదా రోజు 2, 3 యాల‌కుల‌ను నేరుగా అలాగే న‌మిలి తింటుండాలి. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆక‌లి పెరుగుతుంది.

5. ఒక క‌ప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వామును వేసి మ‌రిగించి ఆ నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగుతుండాలి. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అందులో నిమ్మ‌ర‌సం క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts