చిట్కాలు

చలికాలంలో కఫం వెంటాడుతుందా?

చలికాలం వచ్చిందంటే చాలు.. ఎండలు నుంచి విముక్తి పొందవచ్చనుకునేసరికి తేమతో కఫం వచ్చి చేరుతుంది. సాయంత్రం రాగానే మంచుతో దుప్పటిలా కమ్మేస్తుంది. ఆ మంచులో ప్రయాణం చేయడం వల్లగాని తిరగడం వల్ల ఛాతిలో కఫం పేరుకుపోవడం సహజం. ఇది పెద్దవారికంటే చిన్నపిల్లలకు ఎక్కువగా బాధిస్తుంటుంది. నోట్లోని మాట బయటకు చెప్పాలన్నా చెప్పడానికి ఇబ్బందిపడుతుంటారు. కఫం నుంచి సాంత్వన పొందేందుకు పరిష్కారం.

– చెంచా వోమను కడాయిలో వేసి దోరగా వేయించాలి. వాటిని ఓ పలుచని వస్త్రంలో మూట కట్టి పిల్లల ఛాతిపై మృదువుగా కాపితే ఆయాసం తగ్గి, ఊపిరి తేలికగా తీసుకోగలుగుతారు.

– గ్లాసు పాలను మరిగించి అరచెంచా మిరియాలపొడి, కొంచెం బెల్లం కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

– కొన్ని నీళ్లను మరిగించి కప్పు నీటిలో చెంచా మిరియాలపొడి వేసి కషాయంలా కాయాలి. దీనికి ఉప్పు కలిపి బాగా పుక్కిలిస్తుంటే టాన్సిల్స్‌కు దూరంగా ఉండవచ్చు. గొంతునొప్పి తగ్గుముఖం పడుతుంది.

– కడాయిలో అరచెంచా నెయ్యివేసి వేడయ్యాక శొంఠికొమ్ముని వేయించి చల్లార్చాలి. తర్వాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో నెయ్యితోపాటు కలిపి మొదటి ముద్దగా నిత్యం తీసుకోవాలి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

– ఈ కాలంలో ఎవరినైనా కీళ్లనొప్పులు చికాకుపెడుతున్నాయి. అలాంటప్పుడు శొంఠికొమ్ముని అరగదీసి, ఆ గంధాన్ని కొద్దిగా వెచ్చబెట్టి కీళ్లపై పలుచని పొరలా లేపనం వేసుకోవాలి. ఇలా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

how to reduce excessive mucus

– ఈ కఫం వచ్చేముందు జలుబు, దగ్గు వస్తుంది. ముందుగా ఆ జలుబు, దగ్గును నియంత్రించగలిగితే కఫంకు దూరంగా ఉన్నట్లే..

జలుబు, దగ్గు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు

– మూసి ఉన్న గదుల్లో కాకుండా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి.

– ముక్కు, నోరు, చెవులకు చల్లగాలి సోకకుండా స్కార్ఫ్ కట్టుకోవాలి.

– విపరీతమైన చల్లదనం ఉండే వేళ్లల్లో బయటకు వెళ్లకూడదు. మరీ ఉదాయాన్నే లేదా రాత్రివేళ ఇంటిపట్టునే ఉండాలి.

– రెండు, మూడు రోజులకు జలుబు తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించాలి.

– ఈ సమస్య తగ్గని ఎడలా ఆయాసం, కఫం రంగు మారే ప్రమాదం ఉంది. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

– నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరం తేమగా ఉండడమే కాదు కఫం తేలికగా కరిగి బయటకొస్తుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగేందుకు ప్రయత్నించండి.

– చాలామందికి ఏసి పడదు. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చలికాలంలో ఏసి గదులకు దూరంగా ఉండాలి. సినిమా హాళ్లు, ఆడిటోరియం లాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

– ఇంట్లో, బయట కొన్ని రకాల పొగలకు ఊపిరితిత్తులు అలసటకు లోనవుతుంటాయి. ఇంట్లోని అగర్‌బత్తీల వాసనకు దూరంగా ఉండండి.

Admin

Recent Posts