చిట్కాలు

మోకాళ్ల నొప్పులు ఉన్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మోకాళ్ళ నొప్పులనేవి ప్రతీ ఒక్కరికీ పెద్ద సమస్యగా మారింది. వయసు పైబడ్డ వారిలో మోకాళ్ల నొప్పులు సహజమే అయినా, వయసు తక్కువగా ఉన్నవారిలోనూ ఈ నొప్పులు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. మారుతున్న వాతావరణం, మన రోజువారి అలవాట్లు, వ్యాయామం లేకపోవడం మొదలగు అనేక కారణాల వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ నొప్పులని దూరం చేసుకుని ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. మసాజ్ థెరపీ వల్ల మోకాళ్ళ నొప్పుల నుండి త్వరగా రిలీఫ్ పొందవచ్చు. అల్లం, ఆరెంజ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మోకాళ్ళకి బలం చేకూరడంతో పాటు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

వేడి చేసిన గుడ్డతో మోకాళ్ళపై రుద్దడం, ఐస్ ప్యాక్ తో మోకాళ్ళపై మసాజ్ లాగా చేయడం నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఐతే మీకేది సరైనదో తెలుసుకోవాలి. మీకు వేడి పడకపోతే చల్లటి ఐస్ ప్యాక్ తో మసాజ్ చేసుకోవాలి. చల్లదనం పడకపోతే వేడి గుడ్డతో మసాజ్ చేయాలి. మోకాళ్ల నొప్పికి అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. అల్లం రసాన్నిమోకాళ్ళకి రాసుకున్నా, డైలీ రెండు సార్లు అల్లం టీ తాగిన మోకాళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

if you have knee pain follow these tips

ఆరోగ్యానికి పసుపు చేసే మేలు అంతా ఇంతా కాదు. దానివల్ల అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు పసుపు, అల్లం కలిపి దాని మిశ్రమాన్ని రోజూ పొద్దున్న పూట పానీయంగా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గిపోతాయి.

Admin

Recent Posts