హెల్త్ టిప్స్

ఈ విష‌యం తెలిస్తే టాయిలెట్‌లో ఇక‌పై అస‌లు ఫోన్‌ను ఉప‌యోగించ‌రు..!

ప్రతీ ఒక్కరు స్మార్ట్‌ఫోన్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జీవితం లో ముఖ్యమైన భాగంగా మారింది ఈ స్మార్ట్ ఫోన్. చాలా మంది బాత్రూమ్(Toilet) కు వెళ్లినా కూడా ఫోన్ ని తీసుకు వెళ్తున్నారు. దీని వల్ల చాల సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడే చూడండి…. మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి చూస్తే… టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు ఫోన్ ని తీసుకెళ్లడం వల్ల పైల్స్ కి దారి తీస్తుంది.

యువతలో కూడా ఇది ఇప్పుడు వస్తోంది. మొబైల్ వల్ల పైల్స్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే… ఫోన్ ని వాడడం వల్ల సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. దీని మూలంగా ఇది వస్తుంది. కండరాల పై ఒత్తిడిని కూడా పెంచుతుంది. టాయిలెట్‌లో కూర్చుని పేపర్ చదివిన, మొబైల్‌ ని ఉపయోగించిన సమస్యం తెలీదు.

you will not use phone in toilet if you know this

ఇలా ఎక్కువ సేపు కూర్చుని ఉంటే పాయువు మరియు పురీషనాళం(Lower Rectum) యొక్క కండరాల నరాల పై ఒత్తిడి పడుతుంది. ఇది పైల్స్ సమస్యకు ఓ కారణం అవుతుంది. అలానే టాయిలెట్‌కు ఫోన్‌ తీసుకెళ్లడం ద్వారా దానికి బ్యాక్టీరియా అంటుకుంటుంది. చేతులు శుభ్రం చేసుకున్న మొబైల్ ని కడగడం కుదరదు కనుక మొబైల్ కి అంటుకున్న బ్యాక్టీరియా మిమ్మల్ని ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. కాబట్టి మొబైల్ ని బాత్రూమ్ లో ఉపయోగించకుండా ఉంటేనే మేలు. లేదంటే ఎన్నో సమస్యలు బారిన పడే అవకాశం ఉంది.

Admin

Recent Posts