శరీరంలోని అన్ని ఆర్గాన్ల కంటే కాళ్లు ఎక్కువగా పనిచేస్తాయి. అలాగే ఎక్కువగా పట్టించుకోని ఆర్గాన్ కూడా అదే. ప్రతిరోజూ కాళ్ళను ఒకసారి పరీక్షించుకోవాలి. పగుళ్ళు, దెబ్బలు లేకుండా చూసుకోవాలి. నేల తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉత్తికాళ్ళతో నేలపై నడవకూడదు. తడిగా ఉండే చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్లకి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే స్నానం చేసే నీటిలో ఒక కప్పు టొమాటో రసం కలిపి అరగంట తరువాత స్నానం చేయాలి. శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు, అల్లం రసం, చల్లని పానీయాలను తీసుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మ కాంతి పెరగాలని కోరుకునే వాళ్లు జంక్‌ఫుడ్, రోస్టెడ్ ఫుడ్‌ను పూర్తిగా మర్చిపోవాలి.
శొంఠి, మిరియాలు, వాము, సైంధవలవణం అన్నీ కలిపి మెత్తగా నూరి తేనెతో తీసుకుంటే అతిగా వచ్చే ఆవలింతలు తగ్గుతాయి. శొంఠిని మెత్తగా నూరి ఆ పొడిని నీటిలో కలిపి తలకు రాసుకోవాలి. ఇలా రాసుకున్నప్పుడు కాస్తంత మంటగా అనిపిస్తుంది. కాని నొప్పి తీసేసినట్టు పోతుంది. శొంఠి పేస్టుని చెవుల వెనుక రాసుకుంటే కూడా మంచిది. సగంకప్పు నీటిలో కొద్దిగా మిరియాల పొడి వేసి చిన్నమంటపై మరిగించాలి. ఈ నీరు గోరువెచ్చగా అయ్యాక కాసిన్ని నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి ఇలా చేస్తే పంటినొప్పి తగ్గుతుంది. స్వీట్స్, చాక్‌లెట్స్, మరీ వేడిగా ఉన్న పదార్ధాలు, అతిశీతల పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పంటి సమస్యలు వస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే శరీర ఆరోగ్యంతో పాటు పళ్లు, చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
సోపు కూడా అజీర్తి సమస్యలకు, గ్యాస్‌కి చక్కగా పనిచేస్తుంది. అన్నం తినగానే ఒక టీస్పూను సోపుని తినవచ్చు. లేదా మీరు మంచినీరు కాచి తాగేవారైతే ఆ నీటిలోనే సోపుని వేసుకోవచ్చు. స్నానం చేయించిన పిదప పిల్లలకు చిటికెడు పసుపు మాడున రుద్దటం వలన కూడా కొంతవరకు జలుబు అరికట్టవచ్చును. స్వచ్చమైన తెల్లని గుడ్డ తీసుకొని దానిని వైట్ వెనిగర్‌లో ముంచి తలచుట్టూ చుట్టుకోవాలి. ఇలా తలనొప్పి పోయిందనిపించేంత వరకు కొన్ని నిముషాల వ్యవధితో చేస్తుండాలి.