Jaggery : రోజూ ఒక బెల్లం ముక్క చాలు.. గుండె సేఫ్‌..!

Jaggery : బెల్లం.. దీని రుచి గురించి చెప్ప‌వ‌ల‌సిన ప‌నే లేదు. బెల్లంతో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బెల్లాన్ని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బెల్లం వల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వేస‌విలో దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు అదుపులో ఉంటాయి. బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది. ఎముక‌లు ధృడంగా ఉంటాయి. జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

గుప్పెడు కాక‌ర‌కాయ ఆకులు, ఒక చిన్న బెల్లం, నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బ‌లను తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రోజుకు రెండు పూట‌లా వారం రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే పొడి ద‌గ్గుతో బాధ‌ప‌డే వారు బెల్లం పాన‌కంలో తుల‌సి ఆకులు వేసి మ‌రిగించి గోరు వెచ్చ‌గా అయిన తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల పొడి ద‌గ్గు త‌గ్గుతుంది. ఈ చిట్కాను పాటించ‌డం వల్ల పొడి ద‌గ్గు నుండి వెంట‌నే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. కీళ్ల‌ నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కూడా బెల్లం మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు అల్లాన్ని, బెల్లాన్ని స‌మ‌పాళ్ల‌ల్లో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

Jaggery can save heart how to use this
Jaggery

ఎక్కిళ్ల‌తో బాధ‌ప‌డే వారు అల్లం పొడికి స‌మానంగా బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వల్ల ఎక్కిళ్లు వెంట‌నే త‌గ్గుతాయి. రోజూ ఒక బెల్లం ముక్క‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే నెయ్యిని, బెల్లాన్ని స‌మ‌పాళ్ల‌ల్లో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మైగ్రేన్ త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ది అవుతుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో మెట‌బాలిజం రేటు పెరుగుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది. ఈ విధంగా బెల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts