Kashayam For Diabetes : 10 రోజుల పాటు ఈ క‌షాయాన్ని తాగితే.. షుగ‌ర్ ఎంత ఉన్నా స‌రే.. త‌గ్గుతుంది..!

Kashayam For Diabetes : ప్ర‌స్తుత కాలంలో డ‌యాబెటిస్ అనేది ఒక ప్ర‌ధాన అనారోగ్య స‌మ‌స్య‌గా మారింది. ఈ వ్యాధి కార‌ణంగా చిన్న వ‌య‌సులోనే తీపి ప‌దార్థాల‌కు దూరం కావాల్సి వస్తుంది. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం ఇత‌ర‌త్రా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ఆహార విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికి శ‌రీరానికి పోష‌కాలు అందేలా చూసుకోవాలి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఆహార నియ‌మాల‌ను పాటిస్తూనే ఇంట్లో ఒక క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న షుగ‌ర్ కూడా శాశ్వ‌తంగా దూరం అవుతుంది.

షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలోకి రాక ఇబ్బందిప‌డుతున్న వారు ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించే క‌షాయాన్ని త‌గ్గించే క‌షాయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించే ఈ క‌షాయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం మెంతుల‌ను, దాల్చిన చెక్క పొడిని, ప‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ మెంతుల‌ను, అర టీ స్పూన్ ప‌సుపును, చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేయాలి.

Kashayam For Diabetes drink for 10 days and see the changes
Kashayam For Diabetes

త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి 15 నిమిషాల పాటు నీటిని మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ క‌షాయాన్ని రోజూ ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌గా తాగాలి. ఇలా ప‌ది రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చి క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతుంది. ప‌సుపు, దాల్చిన చెక్క‌, మెంతుల్లో ఉండే ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి.

తద్వారా షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉండ‌డంతో పాటు మ‌నం ఇత‌ర ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలను కూడా పొంద‌వ‌చ్చు. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts