Kidney Stones : నేటి కాలంలో మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్ర విసర్జనలో ఆటంకం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది ఈ సమస్యకు శస్త్ర చికిత్స ఒకటే నివారణ మార్గమని భావిస్తారు కానీ సహజ సిద్ద పద్దతుల్లో కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మూత్రపిండాల్లో ఉండే రాళ్లను తొలగించుకోవాలంటే ముందుగా మూత్రపిండాల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. ప్రతిరోజూ మూత్రపిండాలు నీరు రక్తం కలిపి కనీసం 600 నుండి 700 లీటర్ల ద్రవాలను వడపోస్తాయి. షుగర్ వ్యాధి గ్రస్తులల్లో ఈ పరిమాణం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వ్యర్థపదార్థాలన్నీ విసర్జించబడతాయి.
రక్తంలో క్యాల్షియం, పాస్పేట్ లు, ఆక్సిలేట్లు, మెగ్నీషియం, యూరియా వంటివి ఉంటాయి. ఇవి రక్తంలో అవసరానికి మంచి ఉన్నా లేదా ఇవి మన శరీరం నుండి తగిన మోతాదులో విసర్జించబడకపోయినా ఇవే చిన్న స్ఫటికాలుగా మూత్ర పిండాల్లో ఏర్పడతాయి. వీటికి ఇతర వ్యర్థ పదార్థాలన్నీ తోడై రాళ్ల లాగా ఏర్పడతాయి. ఒక్కోసారి చిన్న స్ఫటికం కూడా రాయిగా మారుతుంది. శరీరంలో విటమిన్ ఎ, విటమిన్ డి ఎక్కువగా ఉన్నా విటమిన్ బి తక్కువగా ఉన్నా కూడా రాళ్లు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ ను రాళ్లు ఏర్పడడానికి బలమైన కారణాలుగా చెప్పవచ్చు. అందుకే అధికంగా మాంసాహారం తీసుకునే వారిలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. థైరాయిడ్ కు వేసుకునే మందులు, గ్యాస్ట్రిక్ కు వాడే జెలసిస్ వంటి మందులు, ద్రవాలు కూడా రాళ్లు తయారవడానికి కారణమవుతాయి.
ఈ ద్రవాలలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. దాదాపు పదిశాతం రాళ్లు దీర్ఘకాలిక వ్యాధులకు సంవత్సరాల తరబడి తీసుకునే మందుల కారణంగానే ఏర్పడతాయి. ధూమపానం, మద్యపానం చేసే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తగినంత నీటిని తాగకపోవడం వల్ల కూడా మూత్రపిండాల్లో ఏర్పడతాయి. ఆహారంలో రసాలు, పులుసులు లేకుండా కేవలం ఘనాహారాన్ని తీసుకునే వారు కూడా ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు.
మూత్రపిండాల్లో రాళ్లను 5 మిల్లీ మీటర్ల కంటే తక్కువగా ఉంటే తప్ప వాటిని కరిగించలేము. 5 మిల్లీ మీటర్లు ఆపై ఉన్న వాటిని ఆపరేషన్ చేసి తీయాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లను మన ఇంట్లో ఉండే పదార్థాలను వాడి కరిగించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయని తెలిసిన వెంటనే నీటిని ఎక్కువగా తాగడం, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం చేయాలి. రోజుకు కనీసం 5 నుండి 6 లీటర్ల నీటిని తీసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఇది చక్కటి చిట్కా. అలాగే మెంతి నీటిని తాగడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్ల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని పరగడుపున తాగాలి. ఈ విధంగా చేస్తే మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. అంతేకాకుండా మెంతుల నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. అరటి చెట్టు బెరడు.. దీనిని కూరగా వండుతారు. అరటి చెట్టు కాండంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల తక్కువ పరిమాణంలో ఉండే రాళ్లు మూత్ర మార్గం నుండి బయటకు పోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొత్తిమీర కూడా ఈ సమస్య నుండి బయట పడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తిమీరను మనం వంటలల్లో గార్నిష్ గానే వాడతాం. కానీ కొత్తిమీర మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి.
నీళ్లు వేడయ్యాక కొత్తిమీర ఆకులను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. నేరేడు పండ్లు దొరికే కాలంలో వాటిని రోజుకు ఒకటి చొప్పున తీసుకున్నా చాలు మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. జీర్ణాశయంలో ఉండే రాళ్లు, వెంట్రుకలు కూడా వీటిని తీసుకుంటే కరిగిపోతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మూత్రపిండాల్లో ఉండే రాళ్లను చాలా సులభంగా తొలగించుకోవచ్చు.