Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

Oats Chocolate Milk Shake : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఓట్స్ ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిద ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ర‌క‌ర‌కాల ఆహార పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఓట్స్, చాక్లెట్ ను ఉప‌యోగించి ఆరోగ్యానికి మేలు చేసే రుచిక‌ర‌మైన స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్ చాక్లెట్ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వేయించిన ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్, క‌ర్జూర పండ్లు – 6 నుండి 8, వేయించిన జీడిప‌ప్పు పలుకులు – 10, నీళ్లు – పావు క‌ప్పు, అర‌టిపండు – 1, జాజికాయ పొడి – చిటికెడు, డార్క్ చాక్లెట్ తురుము – 3 టేబుల్ స్పూన్స్, కాచి చ‌ల్లార్చిన పాలు – ఒక‌టిన్న‌ర క‌ప్పు.

Oats Chocolate Milk Shake prepare in this way gives instant energy
Oats Chocolate Milk Shake

ఓట్స్ చాక్లెట్ స్మూతీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఓట్స్ ను, క‌ర్జూర పండ్ల‌ను, వేయించిన జీడిప‌ప్పును వేసి నీళ్లు పోసి పావు గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అర‌టి పండును ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత జాజికాయ పొడి, చాక్లెట్ తురుము, పాల‌ను వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వీటిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. దీనిపై చాక్లెట్ చిప్స్ ను లేదా చాక్లెట్ తురుమును వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ చాక్లెట్ స్మూతీ త‌యార‌వుతుంది. ఈ స్మూతీ త‌యారీలో మ‌నం డార్క్ చాక్లెట్ కు బ‌దులుగా చాక్లెట్ సిర‌ప్ ను కోకో పౌడ‌ర్ ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

అలాగే పాల‌ను కాచి చ‌ల్లార్చిన త‌రువాత వాటిని ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్లగా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. పాలు చ‌ల్ల‌గా త‌రువాత వాటిని స్మూతీ త‌యారీలో వాడుకోవ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా లేదా ఏదైనా స్పెష‌ల్ గా తీసుకోవాలనిపించినప్పుడు ఇలా చాక్లెట్ స్మూతీని త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పిల్ల‌లు ఈ స్మూతీని మ‌రింత ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు.

D

Recent Posts