Lice Remedy : తలలో పేల సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ పేలు మన రక్తాన్ని ఆహారంగా తీసుకుని జీవిస్తూ ఉంటాయి. అలాగే ఈ పేలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. వీటి గుడ్లు చూడడానికి కూడా కనబడనంత చిన్నగా ఉంటాయి. ఇవిఎక్కువగా చెవుల దగ్గర గుడ్లను పెడుతూ ఉంటాయి. వీటి కారణంగా మనకు దురద, చికాకు, కోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మందిఈ బాధను భరించలేక జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. ఆయుర్వేద చిట్కాను ఉపయోగించి తలలో పేలను మనం చాలా సులభంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల చుండ్రు వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా తగ్గుతాయి. తలలో పేలను నివారించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం మనం 5 వెల్లుల్లి రెబ్బలను, అర చెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని వాడడానికి ముందుగా తల స్నానం చేయాలి. తరువాత ఈ వెల్లుల్లి మిశ్రమాన్ని చేత్తో తీసుకుని తల చర్మానికి అంటేలా బాగా రాయాలి. తరువాత జుట్టుంతటికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని 2 గంట పాటు అలాగే ఉంచి తరువాత గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసిన జుట్టు ఆరిన తరువాత జుట్టుకు కొబ్బరి నూనెను బాగా పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే పేల దువ్వెనతో దువ్వుకుని మరలా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల పేల సమ్యస తగ్గుతుంది. వెల్లుల్లి యొక్క ఘూటు వాసన కారణంగా అలాగే నిమ్మరసం వల్ల పేలు, పేల గుడ్లు నశిస్తాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
పేలను నివారించే అనేక రకాల మందులు, షాంపులు మనకు మార్కెట్ లో లభిస్తున్నాయి. అయితే వీటిని వాడడం వల్ల వీటిలోని రసాయనాల కారణంగా చర్మం పై దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే జుట్టుకు కూడా ఇవి హానిని కలిగిస్తాయి. కనుక ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా పేల సమస్య నుండి ఉపశహనాన్ని పొందవచ్చు. ఈ ఆయుర్వేద చిట్కా నెమ్మదిగా పని చేసిన సరే మనకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది.