Puri Masala Curry : పూరీల‌లోకి మ‌సాలా క‌ర్రీని ఇలా చేస్తే.. ఒక పూరీ ఎక్కువే తింటారు..!

Puri Masala Curry : మ‌నం అప్పుడ‌ప్పుడూ అల్పాహారంలో భాగంగా పూరీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఇవి బ‌య‌ట హోట‌ల్స్ లో కూడా ల‌భిస్తాయి. అయితే పూరీలను తిన‌డానికి చేసే కూర రుచిగా ఉంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. కూర రుచిగా లేకుంటే మ‌నం ఎక్కువ పూరీల‌ను తిన‌లేము. ఈ పూరీల‌ను తిన‌డానికి బంగాళాదుంప‌ల‌తో హోట‌ల్స్ స్టైల్ లో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ పూరీ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌చ్చి బ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన బీన్స్ – 5, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, బొంబాయి ర‌వ్వ – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్.

Puri Masala Curry recipe in telugu best for breakfast
Puri Masala Curry

హోట‌ల్ స్టైల్ పూరీ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మిక్సీలో కొబ్బరి ముక్క‌లు, నువ్వులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పెరుగు వేసి పేస్ట్ లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి మెత్త‌గా అయ్యే వేయించాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత దీనిలో రెండు గ్లాసుల నీళ్లు, కూర‌గాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిపై మూత‌ను పెట్టి కూర‌గాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత బొంబాయి ర‌వ్వ‌, ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత క‌సూరి మెంతి, కొత్తిమీర వేసి క‌లపాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. ఇంట్లో పూరీలు చేసిన‌ప్పుడు ఇలా మ‌సాలా కర్రీని చేస్తే అంద‌రూ రెండు పూరీల‌ను ఎక్కువ‌గానే తింటారు.

D

Recent Posts