Liver Clean After Drinking : నేటి తరుణంలో చాలా మంది ప్రతిరోజూ ఆల్కాహాల్ ను తగిన మోతాదులో తీసుకుంటున్నారు. కొందరు వీకెండ్ లో ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొందరు ప్రతిరోజూ విపరీతంగా ఆల్కహాల్ ను తీసుకుంటూ ఉంటారు. ఆల్కాహాల్ ను ఏ విధంగా తీసుకున్నా కూడా క్రమంగా కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయ కణాలు క్రమంగా ఫ్యాటీగా మారిపోతూ ఉంటాయి. కాలేయ పరిమాణం పెరుగుతుంది. అలాగే కాలేయం గట్టిగా మారిపోతూ ఉంటుంది. కాలేయ కణాలు దెబ్బతిని అవి క్రమంగా క్యాన్సర్ గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ తాగినప్పటికి కాలేయ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఒక పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ పండును తీసుకోవడం వల్ల కాలేయ కణాలు పూర్తిగా శుభ్రపడతాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయ కణాల్లోకి చేరిన రసాయనాలు, మలినాలు పూర్తిగా తొలగించబడతాయి. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పండ్లల్లో అంజీరా పండు కూడా ఒకటి. మనకు మార్కెట్ లో అంజీరా పండ్లతో పాటు ఎండిన అంజీరాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకునే వారు నిత్యం 6 నుండి 10 అంజీరా పండ్లను తీసుకోవడం వల్ల ఆల్కాహాల్ కారణంగా కాలేయ కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. అంజీరా పండ్లల్లో బీటా డి గ్లెకోసిల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది కాలేయ కణాల్లో ఉండే రసాయనాలను తొలగించి కాలేయ కణాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేలా చేయడంలో సహాయపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే అంజీరాలో సినో బయోటిక్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి కాలేయ కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా చేయడంలో సహాయపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
ఆల్కాహాల్ తీసుకునే వారు అంజీరా పండ్లను తీసుకోవడం వల్ల కాలేయానికి హాని కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆల్కహాల్ ను తీసుకునే వారికి ఇతరుల కంటే శరీరంలో పోషకాలు ఎక్కువగా అవసరమవుతూ ఉంటాయి. కనుక అంజీరాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. తాజా అంజీరా పండ్లు లభించనప్పుడు డ్రై అంజీరా పండ్లను కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా అంజీరాలు ఆల్కహాల్ తీసుకునే వారి శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.