చిట్కాలు

ఇలా చేస్తే చుండ్రు రమ్మన్నా రాదు! ఎలాగంటే..!

శీతాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అందుకు కారణాలు ఏవైనా మాడుపై చర్మం మాత్రం పొడిబారి అధికమైన దురదకు దారితీస్తుంది. దీనివల్ల తెల్లనిపొట్టు వలె భుజాలపై రాలడమే కాకుండా జుట్టు సమస్యలకు కారణమవుతుంది. చుండ్రు వచ్చిన తర్వాత అలాగే అసలు రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

నిమ్మరసం : ఈ రసం జుట్టుకు తగిలితే పొడిబారుతుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది.

బీట్‌రూట్ : దీన్ని చిన్నముక్కలుగా కట చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు చిక్కటి రంగులోకి మారేవరకు ఉడికించాలి. ఈ నీటిని మాడుపూ మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. మర్దన చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు ధరించాలి. నుదుటిమీదకు నీరు కారకుండా క్యాప్ తగిలించుకోవాలి. లేదంటే రంగు అంటుకుంటుంది.

కొబ్బరినూనె : మాడుపైన చర్మం పొడిబారడం వల్ల కూడా చుండ్రు రావడానికి కారణమవుతుంది. అలాంటి సమయంలో కొబ్బరినూనె, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనె వేడినైనా వేడి చేసి మాడుకు మర్దన చేసి వేడినీటిలో ముంచిన తుండుని తలకు చుట్టుకొని అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

టీ ట్రీ ఆయిల్ : ఈ ఆయిల్ చుండ్రును తరిమికొట్టడంలో బాగా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. టీట్రీ ఆయిల్‌ను మాడుకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. లేదంటే షాంపూలో కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ కలుపుకున్నా ఫలితం ఉంటుంది.

many wonderful home remedies how to reduce dandruff

బీర్ : ఇది ఆరోగ్యానికి హానికరమైన చుండ్రుకు బద్ధశత్రువు. దీంతో ఫంగల్ ఇన్సెక్షన్ కూడా దరిచేరదు. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బీరుని తలకు పట్టిస్తే మాడుకు పట్టిన చుండ్రు వదులుతుంది.

పెరుగు : పుల్లటి పెరుగును పడేయకుండా మరుసటి ఉదయాన్నే తలకుపట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్యలు ఉండవు. దీంతోపాటు జుట్టు మెరుస్తూ ఉంటుంది.

మెంతులు : మెంతులును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని తలపై మాడుకు పెట్టుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే సమస్య తొలుగుతుంది.

బియ్యంనానబెట్టిన నీరు : అన్నం వండేముందు బియ్యం నానబెట్టి కడుగుతారు. ఆ బియ్యాన్ని పారేయకుండా తలస్నానం చేసేటప్పుడు చివరగా తలపై పోసుకోవాలి. ఆ తర్వాత మంచినీటిని పోయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలే కాదు. చుండ్రు
సమస్య కూడా పోతుంది.

చుండ్రురాకుండా ఉండాలంటే : పైన చెప్పినవన్నీ చుండ్రు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అసలు చుండ్రు రాకుండా జాగ్రత్త తీసుకుంటే ఇంత అవసరం ఉండదు కదా. అందుకే ప్రతిరోజూ నీరు సరిపడా తాగాలి. సమతుల్యాహారాన్ని తినాలి. విటమిన్ బి, జింక్‌లను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చుండ్రు పోవడంతో పాటు చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

Admin

Recent Posts