Methi Black Cumin Ajwain : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చూర్ణాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల తల నుండి అరికాళ్ల వరకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఈ చూర్ణాన్ని వాడడం వల్ల కొలెస్ట్రాల్, అధిక బరువు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీనిని వాడడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లను తగ్గించుకోవచ్చు. అలాగే దీనిని వాడడం వల్ల వాత దోషాలన్నింటిని దూరం చేసుకోవచ్చు. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో కూడా ఈ చూర్ణం మనకు సహాయపడుతుంది.
ఈ చూర్ణాన్ని తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. మన అనారోగ్య సమస్యలన్నింటిని దూరం చేసే ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చూర్ణాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను, 5 టీ స్పూన్ల మెంతులను, 2 టీ స్పూన్ల వామును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో మెంతులను వేసి వేయించాలి. తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగ వామును, నల్ల జీలకర్రను కూడా విడివిడిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలు పూర్తిగా చల్లారిన తరువాత వాటిని ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలపాలి. తరువాత ఈ నీటిని టీ తాగినట్టు కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి. ఈ నీటిని రోజూ రాత్రి భోజనం చేసిన ఒక గంట తరువాత తాగాలి.
అలాగే ఈ నీటిని తీసుకున్న తరువాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే ఈ చూర్ణాన్ని 8 సంవత్సరాల లోపు వారు తీసుకోకూడదు. ఈ విధంగా ఈ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ చూర్ణాన్ని వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిని రెండు నెలల పాటు వాడడం వల్ల గౌట్ సమస్య తగ్గుతుంది. ఈ విధంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో చూర్ణాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.